Google Play Store: ప్లే స్టోర్ నుంచి 2500పైగా యాప్‎లను తొలగించిన గూగుల్.. అసలు కారణం ఇదే..

|

Dec 18, 2023 | 5:50 PM

ఈమధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. మన బ్యాంకులో ఉన్న సొమ్ము కాజేసే వారి కంటే కూడా లోన్ యాప్‎ల ద్వారా అధిక శాతం మంది మోసపోతున్నారు. వీటిపై గూగుల్ నిఘా ఉంచింది. 2021 ఏప్రిల్ నుంచి 2022 జూలై మధ్యకాలంలో గూగుల్ (Google) తన ప్లే స్టోర్ (Play Store) నుండి 2,500 మోసపూరిత రుణ యాప్‌లను తొలగించింది.

Google Play Store: ప్లే స్టోర్ నుంచి 2500పైగా యాప్‎లను తొలగించిన గూగుల్.. అసలు కారణం ఇదే..
Google Play Store
Follow us on

ఈమధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. మన బ్యాంకులో ఉన్న సొమ్ము కాజేసే వారి కంటే కూడా లోన్ యాప్‎ల ద్వారా అధిక శాతం మంది మోసపోతున్నారు. వీటిపై గూగుల్ నిఘా ఉంచింది. 2021 ఏప్రిల్ నుంచి 2022 జూలై మధ్యకాలంలో గూగుల్ (Google) తన ప్లే స్టోర్ (Play Store) నుండి 2,500 మోసపూరిత రుణ యాప్‌లను తొలగించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలగించిన మోసపూరిత రుణ యాప్‌ల వివరాలను లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఆర్థిక మంత్రి అధ్యక్షతన ఉన్న ఇంటర్-రెగ్యులేటరీ ఫోరమ్ అయిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎఫ్‌ఎస్‌డిసి) సమావేశాలలో కూడా ఈ విషయం చర్చించబడుతుందని తెలిపారు.

దీనిపై తరచూ పర్యవేక్షించడంతో పాటు చురుగ్గా ఉండడం, నిరంతర అప్రమత్తతతో సైబర్ సెక్యూరిటీ విధానాన్ని కొనసాగించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో అటువంటి మోసాలను తగ్గించడానికి దోహదపడుతుందన్నారు. వీటికి అడ్డుకట్ట వేయడం కోసం తగిన చర్యలు తీసుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యం అని ఆమె చెప్పారు. మోసపూరిత రుణ యాప్‌లను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలలో భాగంగా, ఆర్బీఐ RBI ‘వైట్‌లిస్ట్’ విడుదల చేసింది.

భారత ప్రభుత్వం నిబంధనలకు లోబడి నడుచుకునే చట్టపరమైన యాప్‌ల జాబితాను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్‎తో (Google) తో భాగస్వామ్యం అయిందని వివరించారు. గూగుల్ ప్లే స్టోర్‌ (Google Play Store)లో లోన్ లెండింగ్ యాప్‌ల అమలుకు సంబంధించి తన విధానాన్ని అప్‌డేట్ చేసినట్లు తెలిపారు. భారతదేశంలో రుణాలు ఇచ్చే యాప్‌ల కోసం కఠినమైన అదనపు చర్యలు అమలు చేసేందుకు కొత్త పాలసీలను తీసుకొచ్చినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం సవరించిన విధానం ప్రకారం, రెగ్యులేటెడ్ ఎంటిటీల భాగస్వామ్యంతో పని చేసే యాప్‌లు మాత్రమే ప్లే స్టోర్‌లో అనుమతించబడతాయి. “2021 ఏప్రిల్ నుంచి 2022 జూలై మధ్యకాలంలో గూగులో (Google) తన ప్లే స్టోర్ (Play Store) నుండి దాదాపు 3,500 నుండి 4,000 లోన్ లెండింగ్ యాప్‌లను సమీక్షించింది. అందులో నుంచి 2,500 మోసపూరిత రుణ యాప్‌లను సస్పెండ్ చేసింది” అని తెలిపారు.

సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు, పౌరుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్‌బీఐ, బ్యాంకులు అనేక చర్యలు తీసుకున్నాయని ఆమె వివరించారు. ఆర్బీఐ (RBI) ఎలక్ట్రానిక్-బ్యాంకింగ్ అవేర్‌నెస్ అండ్ ట్రైనింగ్ (e-BAAT) నిర్వహణను రూపొందించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..