Cheetah: కూనో నేషల్ పార్కులో మరో చిరుత మృతి .. ఆరు నెలల్లో తొమ్మిదో ఘటన
ఇటీవల మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయ పార్కులోకి చిరుతలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిని తీసుకొచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటి మరణిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో చిరుత చనిపోవడం కలకలం రేపుతోంది. బుధవారం ఉదయం ధాత్రి అనే ఆడ చిరుత మృతి చెందింది. ఈ విషయాన్ని కూనో జాతీయ పార్క్ అధికారులు వెల్లడించారు.

ఇటీవల మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయ పార్కులోకి చిరుతలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిని తీసుకొచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటి మరణిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో చిరుత చనిపోవడం కలకలం రేపుతోంది. బుధవారం ఉదయం ధాత్రి అనే ఆడ చిరుత మృతి చెందింది. ఈ విషయాన్ని కూనో జాతీయ పార్క్ అధికారులు వెల్లడించారు. అయితే ఆ చితా మరణానికి గల కారణం ఇంకా తెలియదని చెప్పారు. ప్రస్తుతం దాన్ని పోస్టు మార్టంకు పంపించామని.. రిపోర్టు వచ్చాక ఆ చిరుత మరణం వెనుక గల అసలు కారణాలు బయటికి వస్తాయని పేర్కొన్నారు. మరో విషయం ఏంటంటే ఇప్పటివరకు ఆరు నెలల వ్యవధిలో మొత్తం తొమ్మిది చిరుతాలు చనిపోయాయి. ఇదిలా ఉండగా ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబీయా, దక్షిణాఫ్రికా నుంచి రెండు దశల్లో మొత్తం 20 చీతాలను భారత్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సింహాలు, పులులు సంచరిస్తున్న స్థాయిలో చిరుతలు కూడా అలాగే తిరగాలని.. వాటి సంతానం వృద్ధి చెందాలనేది ప్రాజెక్టు చీతా ముఖ్య ఉద్దేశం.
అయితే ఆ చిరుతాలను కూనో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చిన తర్వాత అవి భారత వాతావరణ పరిస్థితులకు అలవాటు పడాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారులు వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఆ పార్కులో ఉన్న మొత్తం చిరుతాలను బహిరంగ ప్రదేశాల్లోకి విడిచిపెట్టాలని ప్రణాళికలు వేశారు. మరో విషయం ఏంటంటే అన్ని చిరుతాల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వాటికి ప్రత్యేకంగా రేడియో – కాలర్స్‌ను అమర్చారు. అయితే వాటిని బహిరంగ ప్రదేశాల్లో విడిచిపెట్టేలోపే.. ఇలా ఒక్కొక్కటి మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వాటికి అమర్చిన రేడియో కాలక్ వల్లే ప్రాణాలు కోల్పోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అందుకోసమే ఆరు చిరుతాలకు రేడియో కాలర్లు తొలగించేశారు. వాస్తవానికి చితాల కదలికలు పసిగట్టడం కోసం వాటి మెదడుకు రెడియో కాలర్లను అమర్చారు. కానీ వాటివల్ల చిరుతాలను గాయాలైనట్లు అధికారులు గుర్తించారు. ఇక నుంచి వాటి కదలికలను గుర్తించేదుకు రేడియో కాలర్ బదులుగా డ్రోన్‌లను ఉపయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.




