Fake Currency Notes: పెరిగిన రూ.2000 నకిలీ నోట్ల సంఖ్య.. పార్లమెంట్‌లో వివరాలు వెల్లడించిన మంత్రి

|

Aug 01, 2022 | 7:04 PM

Fake Currency Notes: పెద్ద నోట్లు రద్దయిన తర్వాత రూ.2000 నోట్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నకిలీ నోట్ల ప్రవాహం ఎక్కువైపోయింది..

Fake Currency Notes: పెరిగిన రూ.2000 నకిలీ నోట్ల సంఖ్య.. పార్లమెంట్‌లో వివరాలు వెల్లడించిన మంత్రి
Follow us on

Fake Currency Notes: పెద్ద నోట్లు రద్దయిన తర్వాత రూ.2000 నోట్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నకిలీ నోట్ల ప్రవాహం ఎక్కువైపోయింది. నకిలీ నోట్లను ఎంత అరికట్టినా.. ఇంకా కుప్పలు తెప్పలుగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్రమంగా పట్టుబడ్డ నకిలీ నోట్ల వివరాలను పార్లమెంట్‌లో ఆర్థిక సహాయ శాఖ మంత్రి పంకజ్‌ చౌదరి లోక్‌సభలో లిఖిత పూర్వకంగా వివరించారు. 2018 నుంచి 2020 మధ్య కాలంలో పట్టుబడిన నోట్ల సంఖ్య పెరిగిందని ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించింది. ఎన్‌సిఆర్‌బి డేటా ప్రకారం.. 2018- 2020 మధ్య పట్టుబడిన నకిలీ నోట్ల సంఖ్య పెరిగిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలిపారు.

2016 నుంచి 2020 మధ్య కాలంలో పట్టుబడిన 2000 రూపాయల నకిలీ నోట్ల సంఖ్యను వెల్లడించారు. 2016లో 2000 రూపాయల నకిలీ నోట్లు 2,272 మాత్రమే పట్టుబడ్డాయని, 2017లో వాటి సంఖ్య 74,898కి పెరిగిందని, 2018లో ఈ సంఖ్య 54,776కి తగ్గిందని చెప్పారు. కానీ 2019లో మళ్లీ ఈ సంఖ్య 90,556కి పెరిగిందన్నారు. 2020లో రూ. 2,000 విలువైన మొత్తం 2,44,834 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే బ్యాంకింగ్ వ్యవస్థలో పట్టుబడిన రూ.2000 నకిలీ కరెన్సీ నోట్ల సంఖ్య 2018-19 నుంచి 2020-21కి తగ్గిందని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. 2021-22లో బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం 13,604 నకిలీ రూ. 2,000 నోట్లను గుర్తించారు. ఇది చెలామణిలో ఉన్న మొత్తం రూ. 2,000 నోట్లలో 0.000635 శాతం.

నకిలీ నోట్ల చెలామణిని నిరోధించేందుకు అధిక నాణ్యత కలిగిన నోబుల్ ఇండియన్ కరెన్సీ నోట్లను విచారించేందుకు ఎన్ఐఏను నోడల్ ఏజెన్సీగా నియమించినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన భద్రతా ఏజెన్సీల మధ్య గూఢచారాన్ని పంచుకోవడానికి FICN కోఆర్డినేషన్ గ్రూప్ (FCORD) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నకిలీ నోట్ల కేసులను దర్యాప్తు చేసే NIAలో టెటర్ ఫండింగ్, నకిలీ కరెన్సీ సెల్‌ను ఏర్పాటు చేశారు. భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య నకిలీ నోట్లను అక్రమంగా తరలిస్తున్న వారిని గుర్తించేందుకు జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

2020-21తో పోలిస్తే 2021-22లో దేశంలో నకిలీ నోట్ల సంఖ్య 10.7 శాతం పెరిగిందని ఆర్‌బీఐ గతంలో తన వార్షిక నివేదికలో పేర్కొంది. 2021-22లో 101.9 శాతం ఎక్కువ రూ. 500 నకిలీ నోట్లు దొరికాయి. అదే సమయంలో 2000 రూపాయల నకిలీ నోట్ల సంఖ్య 54.16 శాతం పెరిగింది.

నకిలీ నోట్ల ప్రభావం..
నకిలీ నోట్లు దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు ప్రవాహం పెరగడం వల్ల ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. నకిలీ నోట్లు దేశంలో చట్టవిరుద్ధమైన లావాదేవీలను పెంచుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి