Indian Railway: ఇండియన్‌ రైల్వే పేరుతో నెట్టింట ప్రచారం.. పొరపాటున నమ్మారో మీ కొంప కొల్లేరే..

మారుతోన్న కాలానికి అనుగుణంగానే నేరాల విధానం కూడా మారుతోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియా అందరికీ అందుబాటులోకి రావడం, టెక్నాలజీలో అనూహ్యంగా మార్పులు రావడంతో ప్రతీ ఒక్కరూ ఇంటర్‌నెట్‌ సేవలను అనివార్యంగా వినియోగించాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీంతో దీనిని ఆసరగా తీసుకుంటున్న కొందరు..

Indian Railway: ఇండియన్‌ రైల్వే పేరుతో నెట్టింట ప్రచారం.. పొరపాటున నమ్మారో మీ కొంప కొల్లేరే..
Indian Railway Alert On Fake News
Follow us

|

Updated on: Nov 01, 2022 | 1:03 PM

మారుతోన్న కాలానికి అనుగుణంగానే నేరాల విధానం కూడా మారుతోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియా అందరికీ అందుబాటులోకి రావడం, టెక్నాలజీలో అనూహ్యంగా మార్పులు రావడంతో ప్రతీ ఒక్కరూ ఇంటర్‌నెట్‌ సేవలను అనివార్యంగా వినియోగించాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీంతో దీనిని ఆసరగా తీసుకుంటున్న కొందరు సైబర్‌ నేరగాళ్లు నిండా ముంచుతున్నారు. ఫిషింగ్‌ మెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌లతో యూజర్లను నిండా ముంచుతున్నారు. తేనె పూసిన కత్తితో గొంతులు కోసేలా, మోసపూరిత ప్రకటనలతో యూజర్లకు గాలెం వేస్తున్నారు. తాజాగా ఇండియన్ రైల్వేస్ పేరుతో ఇలాంటి ఓ మోసమే వెలుగులోకి వచ్చింది.

ఈసారి కేటుగాళ్లు ఇండియన్‌ రైల్వే పేరుతో తమ కన్నింగ్ బుద్ధికి పనిచెప్పారు. వివరాల్లోకి వెళితే.. ఇండియన్‌ రైల్వే లక్కీ లాటరీ నిర్వహిస్తుందని, గెలిచిన వారు నగదు బహుమతి పొందొచ్చని ఓ ప్రచారం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇందులో పాల్గొనాలంటే వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని సదరు పోస్ట్‌లో ప్రస్తావించారు. దీంతో ఇది నిజమేమని పెద్ద ఎత్తున ప్రజలు లింక్‌ ఓపెన్‌ చేసి వివరాలు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ విషయంపై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. సోషల్‌ మీడియాలో జరుగుతోన్న ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ట్విట్టర్‌ పేజీ ద్వారా ఈ విషయాన్ని వివరించారు. ఇది పూర్తిగా మోసపూరిత ప్రకటన అని, దీనికి ఇండియన్‌ రైల్వేకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. లాటరీకి సంబంధించిన మెసేజ్‌లను ఎవరూ ఓపెన్‌ చేయొద్దని, ఇతరులకు ఫార్వర్డ్‌ చేయొద్దని ఇండియన్‌ రైల్వే తెలిపింది. ఒకవేళ ఇలా చేస్తే వ్యక్తిగత సమాచారంతో పాటు, బ్యాంక్‌ అకౌంట్లు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..