హర్యానా సీఎంపై ఈ మాజీ జవాన్ పోటీ..

తేజ్ బహదూర్.. గుర్తున్నాడా? బోర్డర్‌లో సైనికుల బాధను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించి మాజీ బీఎస్ఎఫ్ మాజీ జవాన్. ఈసారి మరో సంచలన ప్రకటన చేశాడు. త్వరలో జరగబోయే హర్యానా ఎన్నికల్లో సీఎం మనోహర్ ఖట్టర్‌తో పోటీ పడుతున్నట్టు ప్రకటించాడు. తేజ్ బహదూర్ జన్‌ నాయక్ జనతా పార్టీలో చేరిన సందర్భంగా తేజ్ ఈప్రకటన చేశాడు. రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, ఎక్కడికక్కడే అవినీతి తిష్టవేసిందని ఆరోపించాడు. బీఎస్ఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్న కాలంలో తేజ్ […]

హర్యానా సీఎంపై ఈ మాజీ జవాన్ పోటీ..
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 3:28 PM

తేజ్ బహదూర్.. గుర్తున్నాడా? బోర్డర్‌లో సైనికుల బాధను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించి మాజీ బీఎస్ఎఫ్ మాజీ జవాన్. ఈసారి మరో సంచలన ప్రకటన చేశాడు. త్వరలో జరగబోయే హర్యానా ఎన్నికల్లో సీఎం మనోహర్ ఖట్టర్‌తో పోటీ పడుతున్నట్టు ప్రకటించాడు. తేజ్ బహదూర్ జన్‌ నాయక్ జనతా పార్టీలో చేరిన సందర్భంగా తేజ్ ఈప్రకటన చేశాడు. రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, ఎక్కడికక్కడే అవినీతి తిష్టవేసిందని ఆరోపించాడు.

బీఎస్ఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్న కాలంలో తేజ్ బహదూర్ యూనిఫామ్‌లో ఉండి.. సైనికుల కష్టాలను కళ్లకు కట్టినట్టు చెప్పాడు. కేంద్ర సైనికులకు సరైన ఆహారం పెట్టడం లేదంటూ ఆరోపించి సంచలనంగా మారాడు. దీంతో ఆయనపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉద్యోగం నుంచి తొలగించారు. గతంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీపై పోటీకి సైతం తేజ్ బహదూర్ సిద్ధపడ్డాడు. కానీ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో పోటీ చేయలేదు. ఇప్పుడు మరోసారి సంచలన ప్రకటనతో వార్తల్లో నిలిచాడు తేజ్ బహదూర్.