AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO Interest Amount Credited To PF Account: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త.. ఖాతాల్లో పీఎఫ్ వ‌డ్డీ జమ

EPFO Interest Amount Credited To PF Account: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు నూతన సంవత్సరం సందర్భంగా శుభవార్త చెప్పింది కేంద్రం. సుమారు ఆరు కోట్ల మందికి ఈపీఎఫ్‌ ...

EPFO Interest Amount Credited To PF Account: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త.. ఖాతాల్లో పీఎఫ్ వ‌డ్డీ జమ
Subhash Goud
|

Updated on: Dec 31, 2020 | 6:36 PM

Share

EPFO Interest Amount Credited To PF Account: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు నూతన సంవత్సరం సందర్భంగా శుభవార్త చెప్పింది కేంద్రం. సుమారు ఆరు కోట్ల మందికి ఈపీఎఫ్‌ ఖాతాదారులకు వడ్డీరేటును అందించనుంది. 2019-20 సంవత్సరానికి గానూ వడ్డీని ఈపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ గురువారం తెలిపారు. 2020లో కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితులు అనుకూలించనప్పటికీ.. పీఎఫ్‌ మొత్తంపై మొదటి విడతగా 8.5 శాతం వడ్డీని ఖాతాదారులకు అందిస్తుండటంతో సంతోషంగా ఉందన్నారు.

గత ఏడాది మార్చిలో 2019-20 ఏడాదికి వడ్డీ రేటును 8.5 శాతంగా ఈపీఎఫ్‌లో నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్‌ కారణంగా మొదటి విడత 8.15 శాతం, రెండో విడతగా 0.35 శాతం చెల్లించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి విడతను అందించింది. ఖాతాదారులు తమ పీఎఫ్‌ వివరాలు ఎస్‌ఎంఎస్‌, ఆన్‌లైన్ లో, అలాగే మిస్డ్‌ కాల్‌, ఉమాంగ్‌ యాప్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.

Also Read: Akash Missiles Export: ఆకాశ్‌ క్షిపణుల ఎగుమతులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌