AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగాల్ లో గోవుల అక్రమ రవాణా, తృణమూల్ కాంగ్రెస్ యువనేత ఇంటిపై సీబీఐ దాడులు, ఆస్తుల స్వాధీనం, పత్తా లేని మిశ్రా

పశ్చిమ బెంగాల్ లో గోవుల అక్రమ రవాణాకు సూత్రధారిగా భావిస్తున్న పాలక తృణమూల్ కాంగ్రెస్ యువనేత వినయ్ మిశ్రా ఇంటిపై సీబీఐ గురువారం దాడులు నిర్వహించింది.

బెంగాల్ లో గోవుల అక్రమ రవాణా, తృణమూల్ కాంగ్రెస్ యువనేత ఇంటిపై సీబీఐ దాడులు, ఆస్తుల స్వాధీనం, పత్తా లేని మిశ్రా
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 31, 2020 | 6:42 PM

Share

పశ్చిమ బెంగాల్ లో గోవుల అక్రమ రవాణాకు సూత్రధారిగా భావిస్తున్న పాలక తృణమూల్ కాంగ్రెస్ యువనేత వినయ్ మిశ్రా ఇంటిపై సీబీఐ గురువారం దాడులు నిర్వహించింది. రాష్ట్రంలో గోవుల స్మగ్లింగ్ పై ప్రస్తుతం జోరుగా దర్యాప్తు జరుగుతోంది. మిశ్రా ఇంటిపై సీబీఐ సిబ్బంది సుమారు 7 గంటలపాటు సోదాలు జరిపారు. అయితే ఇతని జాడ లేకపోవడంతో అతని కోసం లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు. మిశ్రాకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. పశువుల అంతర్ రాష్ట్ర, అక్రమ రవాణా కేసులో దీనికి సంబంధించి  పాలక టీ ఎం సీకి చెందిన మొదటి వ్యక్తి ఇతడేనని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి.

గోవుల అక్రమ  రవాణా, బొగ్గు చోరీలో తృణమూల్ నేతల హస్తం ఉంటోందని బీజేపీ ఇటీవల ఆరోపిస్తోంది. గురువారం కోల్ కతా లోని ఇద్దరు బిజినెస్ మన్ ల ఇళ్లపై కూడా సీబీఐ దాడులు, సోదాలు నిర్వహించింది. వీరిలో అనూప్ మాఝే అనే బిజినెస్ మన్  పరారీలో ఉన్నాడు. ఇక ముర్షీదాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఎనామెల్ హక్ అనే మరో సూత్రధారిని గత నవంబరులో ఢిల్లీలో అరెస్టు చేయగా ఈ నెల 11 న జ్యూడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. ఇతగాడు బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ కుపశువులను అక్రమ రవాణా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అటు-నవంబరు 5 న కోల్ కతాలో అయిదు చోట్ల సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన ఇద్దరు అధికారులను అరెస్టు చేశారు. ఇలా ఈ రాష్టంలో పశువుల రవాణాపై సీబీఐ తీవ్ర దర్యాప్తు జరుపుతోంది.

వెండి ధర భారీగా పడిపోనుందా..?
వెండి ధర భారీగా పడిపోనుందా..?
చిరంజీవి హిట్ కొడితే ఇలా ఉంటది.. ఒకే ఫ్యామిలీ నుంచి 140 టికెట్లు.
చిరంజీవి హిట్ కొడితే ఇలా ఉంటది.. ఒకే ఫ్యామిలీ నుంచి 140 టికెట్లు.
క్రికెటర్ కావాలనుకుంటే.. అనుకోని ప్రమాదం క్రీడా మంత్రిని చేసింది
క్రికెటర్ కావాలనుకుంటే.. అనుకోని ప్రమాదం క్రీడా మంత్రిని చేసింది
ఇంట్లో ఇన్సులిన్ మొక్కను ఎలా పెంచాలి? ఇది డయాబెటిస్‌ వారికి వరం!
ఇంట్లో ఇన్సులిన్ మొక్కను ఎలా పెంచాలి? ఇది డయాబెటిస్‌ వారికి వరం!
కరాచీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి!
కరాచీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి!
NTRకి భారతరత్న తెలుగు ప్రజల ఆకాంక్ష: సీఎం చంద్రబాబు
NTRకి భారతరత్న తెలుగు ప్రజల ఆకాంక్ష: సీఎం చంద్రబాబు
ఉదయం లేచినప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుందా? అసలు కారణాలు ఇవే!
ఉదయం లేచినప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుందా? అసలు కారణాలు ఇవే!
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. 3 నెలల్లోనే 10 కిలోల బరువు తగ్గవచ్చు!
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. 3 నెలల్లోనే 10 కిలోల బరువు తగ్గవచ్చు!
రోజా కూతురును చూశారా? సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్
రోజా కూతురును చూశారా? సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్
71 పరుగులకే 4వికెట్లు ఢమాల్..ఇండోర్‌లో కష్టాల్లో పడ్డ టీమిండియా
71 పరుగులకే 4వికెట్లు ఢమాల్..ఇండోర్‌లో కష్టాల్లో పడ్డ టీమిండియా