Viral Video: ఏనుగులకు కోపం వస్తే ఎట్టుంటుందో తెలుసా.? వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!

ఏనుగులు చాలా తెలివైనవి, బలమైనవి. క్రూర మృగాలకు కూడా సమవుజ్జీలుగా నిలుస్తాయి. అలాంటి ఏనుగులకు కోపం రావడం ఎప్పుడైనా చూశారా?

Viral Video: ఏనుగులకు కోపం వస్తే ఎట్టుంటుందో తెలుసా.? వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!
Elephant
Follow us

|

Updated on: Mar 17, 2022 | 7:50 AM

ఏనుగులు చాలా తెలివైనవి, బలమైనవి. క్రూర మృగాలకు కూడా సమవుజ్జీలుగా నిలుస్తాయి. అలాంటి ఏనుగులకు కోపం రావడం ఎప్పుడైనా చూశారా? వాటికి కోపం వస్తే ఏం చేస్తాయో తెలుసా? తెలుసుకోవాలంటే, ఈ స్టోరీ చూడాల్సిందే.

తమిళనాడులో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వెంటాడి మరీ హడలెత్తిస్తున్నాయి. ఏనుగుల భయానికి ఆఖరికి అటవీ అధికారులు కూడా వణికిపోతున్నారు. తాజాగా తమిళనాడులోని నవమలై అటవీ ప్రాంతంలో ఏనుగులు హల్‌చల్‌ చేశాయి. అటవీ మార్గంలో వెళ్తున్న విద్యుత్ శాఖ అధికారులపై ఏనుగు దాడి చేసింది. వాహనాన్ని వెంబడించి మరీ ధ్వంసం చేసింది ఏనుగు. ఈ దాడిలో కార్ డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అటు తమిళనాడు-కర్ణాటక సరిహద్దు అటవీ ప్రాంతంలో మరో ఘటన జరిగింది. కర్ణాటక అటవీశాఖ అధికారుల సహాయంతో, ముదుమలై విహారయాత్రకు వెళ్లారు కొంతమంది పర్యాటకులు.

రిజర్వు ఫారెస్ట్‌లో పర్యటిస్తుండగా, ఒక్క సారిగా వారిపైకి దాడికి ప్రయత్నిచింది ఓ గజరాజు. వారిని అడవిలో చాలాదూరం వెంబడించింది. జీప్ డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని నడపడంతో ప్రమాదం తప్పింది. ఏనుగు వెంబడిస్తుంటే, ప్రాణాలు అరచేతిలోకి వచ్చాయని చెబుతున్నారు టూరిస్టులు. డ్రైవర్‌ సమయస్పూర్తి వల్లే బతికి బయటపడ్డామని చెప్పారు. ఈ రెండు ఘటనలతో అడవి మార్గాల్లో వెళ్లాలంటేనే జంకుతున్నారు ప్రజలు. అటు అటవీ ఆధికారులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, గతంలో ఏనుగులు ఎప్పుడూ ఇలా దాడులు చేయలేదని, ఈ మధ్యే పెరిగాయని అంటున్నారు అధికారులు. రాత్రిపూట అటవీ మార్గాల్లో ప్రయాణాలు చేయొద్దని సూచిస్తున్నారు. అటు ఏనుగుల సంచారంపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. అడవులకు సమీపంలో ఉండే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏనుగులు కనిపిస్తే ఎదురుగా వెళ్లొద్దని అంటున్నారు ఆఫీసర్లు.