Maharashtra Politics: మాదే అసలైన శివసేన..ప్రజాస్వామ్యంలో అంతిమంగా గెలిచేది నెంబరే.. టీవీ9తో ఏక్‌నాథ్‌ షిండే..

|

Jun 24, 2022 | 11:52 AM

Maharashtra political crisis: మహారాష్ట్రలో అసలైన పొలిటికల్‌ గేమ్‌ మొదలైంది. రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. శివసేనకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde) క్యాంప్‌కు చేరుకుంటున్నారు. ఇవాళ మరికొంత మంది ఎమ్మెల్యేలు..

Maharashtra Politics: మాదే అసలైన శివసేన..ప్రజాస్వామ్యంలో అంతిమంగా గెలిచేది నెంబరే.. టీవీ9తో ఏక్‌నాథ్‌ షిండే..
Eknath Shinde
Follow us on

Maharashtra political crisis: మహారాష్ట్రలో అసలైన పొలిటికల్‌ గేమ్‌ మొదలైంది. రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. శివసేనకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde) క్యాంప్‌కు చేరుకుంటున్నారు. ఇవాళ మరికొంత మంది ఎమ్మెల్యేలు గౌహతి చేరుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే షిండే బలం మరింత పెరిగినట్లే. షిండే క్యాంప్‌లో శివసేన ఎమ్మెల్యేల సంఖ్య 50 దాటే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహా రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగనున్నాయి? ముంబై టు గౌహతి…మధ్యలో ట్విస్ట్‌లు ఉంటాయా? అన్న ఉత్కంఠ నెలకొంది. ఈక్రమంలో రెబెల్స్‌ నేత షిండే టీవీ9తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. తమదే అసలైన శివసేన అని ఆయన అన్నారు. 37 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్‌ ఫిగర్‌ తమ దగ్గర ఉందని పేర్కొన్నారు.. మైనార్టీలో ఉన్నవాళ్ల నిర్ణయాలు చెల్లవని చెప్పుకొచ్చారు.12 మందిపై సస్పెన్షన్‌ చెల్లదని అన్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా గెలిచేది నెంబరే అని షిండే వ్యాఖ్యానించారు..

బలపరీక్ష తర్వాత ఏమైనా జరగొచ్చు..
ఇటు ఉద్దవ్‌ థాక్రే ముందున్న అవకాశాలేంటి? ఎమ్మెల్యేల తిరుగుబాటుతో పార్టీపై ఆయన పట్టుకోల్పోయారా? కేవలం 13 మంది ఎమ్మెల్యేలే ఆయన దగ్గర ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేయబోతున్నారు? ఆయన ఇంకా రాజీనామా చేయలేదు. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్‌ను కోరారు. వారిపై వేటు వేస్తే సభలో బలం నిరూపణకు వెళతారా? అనేది చూడాలి.
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై బీజేపీ ప్లానేంటి? అనేది తెలియాల్సి ఉంది. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నారు. షిండే తన వెనుక మహాశక్తి ఉందని కామెంట్ చేశారు. దీంతో ఈ శక్తి బీజేపీ అని ప్రచారం జరుగుతోంది. రాజకీయ చాణక్యుడు శరద్‌ పవార్‌ ఏం చేయబోతున్నారు? ఈ సంక్షోభాన్ని ఎలా హ్యాండిల్‌ చేస్తారు? ఏ వైపు ఆయన నిలుస్తారు? అనేది కూడా ఇంట్రెస్టింగ్‌. బలపరీక్ష తర్వాతే ఏమైనా జరుగుతుందని అని అయన అంటున్నారు. ఇటు కాంగ్రెస్‌ మాత్రం ఎన్సీపీతోనే కలిసి నడిచే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం స్పీకర్‌ సీటు ఖాళీగా ఉంది. ఇప్పుడు డిప్యూటీ స్పీకరే కీలకం. అనర్హత వేటుపై ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారు? షిండేను శాసనసభ పక్ష నేతగా గుర్తిస్తారా? షిండే వర్గం కోర్టుకు వెళుతుందా? అనే పరిణామాలు కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..