న్యూఢిల్లీ, ఆగస్టు 21: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)కు చెందిన అధికారి అలోక్ రంజన్ ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఢిల్లీలో సాహిబాబాద్‌లోని రైల్వేట్రాక్ పక్కన ఆయన మృతదేహం లభ్యమైంది. ఆ అధికారి పేరు అలోక్ రంజన్ అని పోలీసులు వెల్లడించారు. మృతుడిని లోక్ కుమార్ రంజన్‌గా పోలీసులు నిర్ధారించారు.
ఘజియాబాద్‌కు చెందిన అలోక్ కుమార్ న్యూఢిల్లీలోని డిప్యుటేషన్‌పై ఈడీలో పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన ఆదాయపన్ను విభాగంలో విధులు నిర్వర్తించేవారు. ఇటీవల ఓ కేసులో ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సీబీఐ ఆయనను రెండు సార్లు విచారించింది. అయితే తగిన సాక్ష్యాధారాలు లభ్యంకాకపోవడంతో వదిలిపెట్టారు. లంచం కేసులో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ సింగ్‌ను సీబీఐ అరెస్టు చేసిన తర్వాత అలోక్ కుమార్ రంజన్ పేరు తెరపైకి వచ్చింది. తన కుమారుడిని అరెస్టు చేయకుండా ఉండేందుకు సందీప్ సింగ్ రూ. 50 లక్షలు డిమాండ్ చేశాడని ఓ వ్యక్తి సీబీఐకి ఫిర్యాదు చేశాడు. దీంతో సీబీఐ అతనిపై నిఘా పెట్టింది. సందీప్ సింగ్ ఢిల్లీలో రూ. 20 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసిన ముంబై నగల వ్యాపారి నుంచి కూడా సందీప్ సింగ్ భారీగా లంచం తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో సందీప్ సింగ్‌తో పాటు అలోక్ రంజన్ పేరు కూడా నిందితుడిగా చేర్చారు. ఈ కేసు నేపథ్యంలో సందీప్ సింగ్‌ను సస్పెండ్ అయ్యాడు
ఈడీ అధికారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సందీప్ సింగ్‌తో పాటు అవినీతి కేసులో తన పేరును చూసి అలోక్ రంజన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని, సింగ్‌ను సీబీఐ అరెస్టు చేసిన తర్వాత మరింత కలత చెందినట్లు సమాచారం.