ఫారన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా) నిబంధనలు ఉల్లంఘించిందనే ఆరోపణల నేపథ్యంలో బైజూస్ సంస్థ కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దాడులు చేశారు. బెంగళూరులోని బైజూస్ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. బెంగళూరులోని మూడు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు ఈడీ ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది ఈడీ. ‘రవీంద్రన్ బైజు అండ్ కంపెనీ ‘థింక్&లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్’(బైజూస్ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్) ఫెమా నిబంధనలను ఉల్లంఘించింది. ఈ కారణంగా కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో కీలక పాత్రాలు, డిజిటల్ డేలాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈడీ అధికారులు.
ED has conducted searches at 3 premises in Bengaluru in the case of Raveendaran Byju and his company ‘Think & Learn Private Limited’ (Byju online learning platform) under the provisions of FEMA. During the search, various incriminating documents and digital data was seized.
ఇవి కూడా చదవండి— ED (@dir_ed) April 29, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..