Rahul Gandhi: ఐదో రోజు ఈడీ విచారణకు హాజరైన రాహుల్‌ గాంధీ.. స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తున్న అధికారులు..

|

Jun 21, 2022 | 12:41 PM

Rahul Gandhi: నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఈడీ విచారణ కొనసాగుతోంది. తాజాగా మంగళవారం మరోసారి రాహుల్‌ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట విచారణకు...

Rahul Gandhi: ఐదో రోజు ఈడీ విచారణకు హాజరైన రాహుల్‌ గాంధీ.. స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తున్న అధికారులు..
Rahul Gandhi (File Photo)
Follow us on

Rahul Gandhi: నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఈడీ విచారణ కొనసాగుతోంది. తాజాగా మంగళవారం మరోసారి రాహుల్‌ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. దీంతో రాహుల్‌ ఈడీ ముందు హాజరుకావడం ఇది ఐదో రోజు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని ఇప్పటికే నాలుగు రోజుల్లో 40 గంటల పాటు రాహుల్న్‌ ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. తాజాగా పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద అధికారులు రాహుల్ గాంధీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేస్తున్నారు.

విచారణలో భాగంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులు వైఐఎల్‌కి బదలాయింపు, షేర్ల వాటాలు, ఆర్ధిక లావాదేవీల అంశాలపై ఈడీ అధికారులు రాహుల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో సోనియా గాంధీ జూన్‌ 23న హాజరుకావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆమె అనారోగ్యం కారణంగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె విచారణకు హాజరువతారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే ఈడీ ఆఫీసుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతోన్న నేపథ్యంలో అధికారులు సోమవారం ఈడీ కార్యాలయం చుట్టూ 144 సెక్షన్‌ విధించారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున దర్యాప్తు సంస్థ ఆఫీసుకు చేరుకున్నారు. దీంతో భారీగా పోలీసు, పారామిలిటరీ బలగాలను మోహరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..