Income Tax: కోవిడ్‌ చికిత్సకు రూ. 2 లక్షల క్యాష్‌ చెల్లించేలా ఐటీ ఉత్తర్వులు.. ఎప్పటివరకంటే?

COVID-19 Treatment: కోవిడ్ రోగులకు చికిత్స చేసే ఆసుపత్రులకు, బాధితులకు ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించింది. కోవిడ్

Income Tax: కోవిడ్‌ చికిత్సకు రూ. 2 లక్షల క్యాష్‌ చెల్లించేలా ఐటీ ఉత్తర్వులు.. ఎప్పటివరకంటే?
Coronavirus Treatment

Updated on: May 08, 2021 | 5:53 PM

COVID-19 Treatment: కోవిడ్ రోగులకు చికిత్స చేసే ఆసుపత్రులకు, బాధితులకు ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించింది. కోవిడ్ చికిత్సను అందించే ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, నర్సింగ్ హోంలు, కోవిడ్ కేర్ సెంటర్లు, ఇతర మెడికల్ ఫెసిలిటీలు కోవిడ్ రోగుల నుంచి రూ.2 లక్షలకు మించి నగదును స్వీకరించవచ్చని వెల్లడించింది. ఈ వెసులుబాటు మే 31 వరకు అమల్లో ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 269 ఎస్‌టీ ప్రకారం అనుమతిని మంజూరు చేసింది. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు ఈ విధంగా నగదు రూపంలో వసూలు చేయవచ్చునని తెలిపింది. రోగి పాన్ లేదా ఆధార్ సంఖ్యను నమోదు చేసుకుని రూ.2 లక్షల కన్నా ఎక్కువ నగదు స్వీకరించవచ్చని వెల్లడించింది. రోగికి, ఆ సొమ్మును చెల్లించేవారికి మధ్య గల సంబంధాన్ని కూడా రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆసుపత్రులకు పలు సూచనలు చేసింది.

వాస్తవానికి ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం ఒక రోజులో రూ.2 లక్షల కన్నా ఎక్కువ నగదు లావాదేవీలు జరపడానికి అనుమతి లేదు. నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా 2017లో కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను ప్రవేశపెట్టింది. అయితే ఈ నిబంధనను తాత్కాలికంగా కోవిడ్ రోగుల చికిత్స కోసం సడలించారు. ఇదిలాఉంటే.. మరోవైపు ఆసుపత్రులు కోవిడ్ చికిత్స అందించే కేంద్రాలు రోగుల నుంచి నగదునే కోరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీమా పథకాల ప్రాతిపదికపై రోగులను చేర్చుకునేందుకు ఆసుపత్రులు తిరస్కరిస్తున్నట్లు చాలా మంది ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా నగదు చెల్లించి, చికిత్స పొందాలని.. ఆ తర్వాత బీమా కోసం దరఖాస్తు చేయవచ్చని పలు ఇన్సూరెన్స్ కంపెనీలు పేర్కొంటున్నాయి.

Also Read:

నెలకు 85 లక్షల డోసుల వ్యాక్సిన్ ఇవ్వండి, ప్రజలందరికీ 3 నెలల్లో వ్యాక్సినేషన్ చేస్తాం , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Covid Vaccine: మరో ఇండియా వ్యాక్సిన్.. త్వరలో అందుబాటులోకి జైడస్ టీకా.?