భారత్‌లోనూ వరుస భూ ప్రకంపనల హడల్.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో భూకంపం.. 4.0 తీవ్రతగా నమోదు..

|

Mar 24, 2023 | 2:56 PM

ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్‌లో కూడా భూకంపం సంభవించింది. ఎక్కడికక్కడ గందరగోళం నెలకొంది. ప్రజలు రెండు మూడు సార్లు ప్రకంపనల భయంతో వణికిపోయారు.

భారత్‌లోనూ వరుస భూ ప్రకంపనల హడల్.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో భూకంపం.. 4.0 తీవ్రతగా నమోదు..
Earthquake
Follow us on

ఢిల్లీ తర్వాత ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు వణికాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో శుక్రవారం ఉదయం 10:31 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై ప్రకంపనల తీవ్రత 4.0గా నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు ఆగ్నేయంగా 24 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు సంభవించాయి.. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించింది. అయితే అదృష్ట వశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

గత బుధవారం ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 2.7గా నమోదైంది. దీని కేంద్రం న్యూఢిల్లీలో భూమికి ఐదు కిలోమీటర్ల దిగువన ఉంది. సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి.
అంతకుముందు నిన్న అంటే మంగళవారం రాత్రి 10.19 గంటలకు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా మొత్తం ఉత్తర భారతదేశంలో బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.6గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో 156 కి.మీ లోతులో ఉంది.

మంగళవారం నాటి భూకంపం ధాటికి ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్‌లో కూడా భూకంపం సంభవించింది. ఎక్కడికక్కడ గందరగోళం నెలకొంది. ప్రజలు రెండు మూడు సార్లు ప్రకంపనల భయంతో వణికిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..