Azadi Ka Amrit Mahotsav: చరిత్ర చెప్పని వీరుడు.. అడవిబిడ్డల కోసం బ్రిటిష్ వారిపై తిరగబడిన తెలుగు బిడ్డ.. తొలితరం మన్యం వీరుడు..

|

Aug 05, 2022 | 2:48 PM

చంద్రయ్య నాయుడు తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని బురదకోటను స్థావరంగా చేసుకొని బ్రిటీషువారిపై వ్యతిరేకంగా 1879 లో తిరుగుబాటు లేవదీశాడు. ఈ తిరుగుబాటునే నాటి బ్రిటిష్ అధికారులు రాంప పితూరీ అని పేరుపెట్టారు.

Azadi Ka Amrit Mahotsav: చరిత్ర చెప్పని వీరుడు.. అడవిబిడ్డల కోసం బ్రిటిష్ వారిపై తిరగబడిన తెలుగు బిడ్డ.. తొలితరం మన్యం వీరుడు..
Dwarabandala Ramachandrayya
Follow us on

Azadi Ka Amrit Mahotsav: భారత దేశానికి వ్యాపారం కోసం వచ్చి న బ్రిటిష్ వారు దేశాన్ని పాలించే రాజులయ్యారు. భారతీయులను బానిసలుగా భావించి ఇష్టారీతిన పాలించడం మొదలు పెట్టారు. బ్రిటిష్ పాలకుల దాశ్య శృంఖలాలను నుంచి విముక్తి కోసం అనేకమంది వీరులు, వీరమాతలు పోరాడారు. తమ ప్రాణాలను తృణప్రాయముగా త్యజించి బ్రిటిష్ వారి చీకటి పాలన నుంచి తమ దేశాన్ని విముక్తి చేయడం కోసం పోరాడిన వీరులు ఎందరో ఉన్నారు. అయితే ఎందరో వీరులు చరిత్ర మాటున దాగి ఉన్నారు.. అలాంటి వీరుల త్యాగాలను భావితరాలకు అందించడానికి టీవీ9 ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా తెలుగు గడ్డ మీద పుట్టిన ఎందరో వీరులు చరిత్ర మాటున దాగున్నారు.. అలాంటి విప్లవ వీరుడు ద్వారబంధాల రామచంద్రయ్య నాయుడు. గిరిజనుల అండగా నిలబడి.. వారికోసం పోరాడి.. ప్రాణాలను త్యాగం చేసిన విప్లవ వీరుడు. ఏజెన్సీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు గారి కన్నా ముందే  తిరుగుబాటును లేవదీసి బ్రిటిష్ వారితో పోరాడి వీరమరణం పొందిన ధీరుడు ద్వారబంధాల రామచంద్రయ్య నాయుడు.

ద్వారబంధాల చంద్రయ్య నాయుడు తూర్పుగోదావరి జిల్లా తొలి స్వాతంత్య్ర సమరయోధుడు. తూర్పుగోదావరి, ఖమ్మం, విశాఖపట్నం జిల్లాలలో విస్తరించిన మన్యం అటవీ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న రైతులను.. స్థానిక బ్రిటిష్ అధికారులు, ముఠాదార్లు, భూస్వాములు అక్రమంగా ఇబ్బంది పెట్టేవారు. గిరిజనలు పండించిన పంటలను దోచుకునేవారు. దీంతో చంద్రయ్య నాయుడు తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని బురదకోటను స్థావరంగా చేసుకొని బ్రిటీషువారిపై వ్యతిరేకంగా 1879 లో తిరుగుబాటు లేవదీశాడు. ఈ తిరుగుబాటునే నాటి బ్రిటిష్ అధికారులు రాంప పితూరీ అని పేరుపెట్టారు. ద్వారబంధాల చంద్రయ్య, పులిచింత సాంబయ్య అంబుల్ రెడ్డి న్యాయకత్వంలో సామ్రాజ్యవాదుల దోపిడీ-ప్రజల ప్రతిఘటనలో భాగంగా మన్యం రైతులు, మురాదార్లు అధికార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈ తిరుగుబాయి లేవదీశారు.

బ్రిటిష్ వారి పాలనపై ఎంతో ఉదృతంగా జరిగిన ఈ తిరుగుబాట్లకు ద్వారబంధాల రామచంద్రయ్య నాయుడు, పులిచింత సాంబయ్య, బొదులూరు అంబులు రెడ్డి నాయకులుగా వ్యవహరించారు. గిరిజనులను ఇబ్బంది పెట్టే సైనికులను పట్టుకుని తన గండ్ర గొడ్డలితో వారి తలలను నరికివేసేవారు. బ్రిటిషు వారికి దొరకకుండా వారిని ముప్పుతిప్పలుపెడుతూ అటవీ ప్రాంతాలలో దాక్కునేవారు.. 1879 ఏప్రిల్ లో అడ్డతీగల పోలీసుస్టేషన్ ను ద్వంసం చేసి అక్కడ ఉన్న అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.. అదే సంవత్సరం నవంబరులో చంద్రయ్య  అనుచరులను 79 మందిని నాటి బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు రహస్యంగా అత్యంత నేర్పుతో వలపన్ని పట్టుకుని వారందరినీ అతి కిరాతకంగా కాల్చి తలనరికి చంపేశారు. 1880 ఫిబ్రవరి 12 న చంద్రయ్యకి నమ్మకస్తుడై జంపా పండయ్య అనే వ్యక్తికి భారీ బహుమతులు ఇచ్చి బ్రిటిష్ అధికారులు లోబరుచుకున్నారు. పండయ్య ఇచ్చిన సమాచారంతో చంద్రయ్య ఆచూకీ తెలుసుకున్నారు. పట్టుకుని కాల్చి చంపేశారు.  ఇప్పటికీ కొంతమంది మన్యం ప్రజలు చంద్రయ్యను దైవంగా కొలిచేవారున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..