AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drugs: త్రిపురలో రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్

డ్రగ్స్ నివారణకు పోలీసులు, సంబంధిత అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. యధావిధిగా అమ్మకాలు జరుగుతున్నాయి. సినిమా స్టైలో, ఇతర మార్గాల్లో డ్రగ్స్ ను సప్లయ్ చేస్తూ కావాల్సిన వాళ్లకు చేరవేస్తున్నారు. అయితే ఇటీవల పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో దళారులు పోలీసులకు చిక్కుతున్నారు.

Drugs: త్రిపురలో రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్
Drugs
Balu Jajala
|

Updated on: Mar 10, 2024 | 8:57 PM

Share

డ్రగ్స్ నివారణకు పోలీసులు, సంబంధిత అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. యధావిధిగా అమ్మకాలు జరుగుతున్నాయి. సినిమా స్టైలో, ఇతర మార్గాల్లో డ్రగ్స్ ను సప్లయ్ చేస్తూ కావాల్సిన వాళ్లకు చేరవేస్తున్నారు. అయితే ఇటీవల పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో దళారులు పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా ఉత్తర త్రిపురలోని బాగ్బాసా నాకా పాయింట్ సమీపంలో అగర్తలా వెళ్లే వాహనం నుంచి రూ.5 కోట్ల విలువైన 55,000 మెథాంఫేటమిన్ మాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకొని ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు త్రిపుర-అస్సాం అంతర్రాష్ట్ర సరిహద్దులోని బాగ్బాసా వద్ద ఒక వాహనాన్ని అడ్డగించి చెక్ చేయగా,  స్థానికంగా యాబా టాబ్లెట్ లేదా పార్టీ టాబ్లెట్ అని కూడా పిలువబడే మాత్రలు దొరికాయని ఉత్తర త్రిపుర జిల్లా పోలీసు సూపరింటెండెంట్ భానుపాద చక్రవర్తి తెలిపారు.

మయన్మార్ నుంచి స్మగ్లింగ్ చేసిన డ్రగ్స్ మిజోరం, అస్సాం రాష్ట్రాల మీదుగా త్రిపురలోకి ప్రవేశించాయి. మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నవారిని విచారిస్తున్నాం. అరెస్టయిన డ్రగ్ పెడ్లర్లు దక్షిణ అస్సాంలోని కరీంగంజ్ కు చెందినవారు’ అని చక్రవర్తి తెలిపారు. మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంలో పోలీసుల పాత్రను ప్రశంసించింది త్రిపుర హోంశాఖ. ఈ సందర్భంగా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా రియాక్ట్ అవుతూ “నషా ముక్త్ భారత్ ను నిర్మించాలనే మా దార్శనికతలో త్రిపుర పోలీసుల పాత్ర ప్రశంసనీయం” అని అన్నారు.

మయన్మార్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న మెథాంఫేటమిన్ మాత్రలు ఇటీవలి కాలంలో ఎక్కువగా అక్రమ రవాణాకు గురవుతున్న మాదక ద్రవ్యాల్లో ఒకటి. ఈ మందులకు ఈశాన్య రాష్ట్రాలు, భారతదేశంలోని ఇతర ప్రాంతాలు, పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో భారీ డిమాండ్ ఉంది. త్రిపురలోని ఉనకోటి జిల్లా రాధానగర్ లో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా అస్సాం రైఫిల్స్ ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతేకాదు వరుస సోదాలు చేస్తూ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంటున్నారు.

Follow Us
ఈ 7 కలలు వస్తే అదృష్టం తలుపు తడుతున్నట్టే.. కష్టాలు తొలగి సుఖ..
ఈ 7 కలలు వస్తే అదృష్టం తలుపు తడుతున్నట్టే.. కష్టాలు తొలగి సుఖ..
సన్న బియ్యం Vs స్టీమ్ బియ్యం.. ఆరోగ్యానికి ఏవి మంచివి..?
సన్న బియ్యం Vs స్టీమ్ బియ్యం.. ఆరోగ్యానికి ఏవి మంచివి..?
వ్యాపారం లాభాల బాట పట్టాలంటే.. ఈ వాస్తు టిప్స్ తప్పక తెలుసుకోండి!
వ్యాపారం లాభాల బాట పట్టాలంటే.. ఈ వాస్తు టిప్స్ తప్పక తెలుసుకోండి!
రాజమౌళి మాస్టర్ ప్లాన్.. వారణాసిలో ఆ స్టార్ హీరో కూడా..?
రాజమౌళి మాస్టర్ ప్లాన్.. వారణాసిలో ఆ స్టార్ హీరో కూడా..?
వర్షంలో తడిసిన కరెన్సీ నోట్లను ఆరబెట్టడానికి సులువైన చిట్కాలు..
వర్షంలో తడిసిన కరెన్సీ నోట్లను ఆరబెట్టడానికి సులువైన చిట్కాలు..
మీషోలో షాపింగ్ చేస్తున్నారా? జాగ్రత్త.. హైకోర్టు కీలక ఆదేశాలు!
మీషోలో షాపింగ్ చేస్తున్నారా? జాగ్రత్త.. హైకోర్టు కీలక ఆదేశాలు!
శ్రీలంకలో భారత్‌కు ఎందుకింత టెన్షన్?
శ్రీలంకలో భారత్‌కు ఎందుకింత టెన్షన్?
సూర్యగ్రహణం రోజే భారీ గ్రహ మార్పులు.. ఈ రాశులకు డబ్బు, కెరీర్‌..
సూర్యగ్రహణం రోజే భారీ గ్రహ మార్పులు.. ఈ రాశులకు డబ్బు, కెరీర్‌..
ధోనీ పేరిట ఉన్న 7 వరల్డ్ రికార్డులు ఇవే
ధోనీ పేరిట ఉన్న 7 వరల్డ్ రికార్డులు ఇవే
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చాలు విద్యుత్ బిల్లు తగ్గుతుంది!
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చాలు విద్యుత్ బిల్లు తగ్గుతుంది!