రావాలమ్మా.. రావాలి.. ఇప్పుడివే ఫేమస్! సోషల్ మీడియాలో డ్రోన్ పకోడిలు వైరల్!
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో, పాకిస్థాన్ డ్రోన్ దాడులను భారత వైమానిక రక్షణ విజయవంతంగా అడ్డుకున్న నేపథ్యంలో 'డ్రోన్ పకోడాలు' అనే హాస్య విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేయడంతో ఇది మరింతగా ప్రాచుర్యం పొందింది.

భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య, ఒకవైపు డ్రోన్ దాడుల గురించి చాలా చర్చలు జరుగుతుండగా మరోవైపు ‘డ్రోన్ పకోడాలు’ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ డ్రోన్ పడోడాలను రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. “డ్రోన్ పకోడాస్ – ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్‌లో కొత్త స్నాక్. జై హింద్,” అని జనరల్ ధిల్లాన్ ఆ ఫోటోకు క్యాప్షన్ పెట్టారు. పాకిస్థాన్ మన దేశంపై దాడి చేసేందుకు సరిహద్దుల్లో భారీ ఎత్తున డ్రోన్లు ప్రయోగించిందని కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించిన విషయం తెలిసిందే.
అయితే ఆ డ్రోన్లను మన శక్తివంతమైన డిఫెన్స్ సిస్టమ్స్‌తో గాల్లోనే పేల్చేశామని కూడా వివరించారు. అలా పాక్ డ్రోన్లను మన సైన్యం పకోడాల్లా తినేశారనే అర్థం వచ్చేలా మాజీ సైనిక అధికారి ఇలా సెటైర్లు వేశారు. “భారత వైమానిక రక్షణ రెజిమెంట్‌కు పూర్తి మద్దతు ఇవ్వడానికి పంజాబీ సోదరులందరూ టర్కిష్-చైనీస్ వంటకం ‘డ్రోన్ పకోరా’ తినడం ప్రారంభించాలని సూచించారు. మా వైమానిక రక్షణ దళాల పట్ల మేం గర్విస్తున్నాం” అని ఆయన రాశారు. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తూ.. పాకిస్థాన్‌పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
