AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రంలో అనుమానంగా కనిపించిన రెండు బోట్లు.. వెంబడించగా షాకింగ్ సీన్.. మామూలు స్కెచ్ కాదుగా..

సముద్రంలో చేజింగ్.. సినిమా తరహాలో బంగారం పట్టివేత. 4.7కిలోల బంగారం సీజ్.. తమిళనాడు తీరంలో జరిగిందీ ఘటన. చెన్నై కోస్ట్ గార్డ్ నడి సముద్రంలో వెంబడించి స్మగ్లర్స్‌ను పట్టుకున్నారు. భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సముద్రంలో అనుమానంగా కనిపించిన రెండు బోట్లు.. వెంబడించగా షాకింగ్ సీన్.. మామూలు స్కెచ్ కాదుగా..
Gold Smugling In Sea
Shaik Madar Saheb
|

Updated on: Aug 08, 2024 | 9:36 AM

Share

గోల్డ్ స్మగ్లింగ్‌పై ఎంత నిఘా పెట్టినా.. ఏదో ఒక రూపంలో అక్రమ రవాణా సాగుతూనే ఉంది. ఇప్పటివరకు విమానాల్లోనే బంగారం అక్రమ తరలింపు చూశాం. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. దొంగతనంగా బంగారం తీసుకురావడం, ఎయిర్‌పోర్టుల్లో దొరికిపోవడం కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. కానీ.. బంగారం స్మగ్లింగ్‌కు కొత్త దారులు ఎంచుకుంటున్నారు స్మగ్లర్లు. శ్రీలంక నుంచి తమిళనాడుకు తరలిస్తున్న బంగారాన్ని సీజ్ చేశారు. సముద్రంలో సినిమాటిక్ రేంజ్‌లో చేజింగ్ చేసి స్మగర్లను పట్టుకున్నారు.

శ్రీలంకలోని గల్పిటి థోరయాది నుంచి భారత్‌కు అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నారన్న సమాచారం పోలీసుల దగ్గర ఉండటంతో.. రూట్ మార్చారు స్మగ్లర్లు. సముద్రమార్గం ద్వారా తమిళనాడుకు బంగారం తరలిస్తుండగా.. అడ్డంగా దొరికిపోయారు. చెన్నై కోస్ట్ గార్డ్ సిబ్బంది.. స్మగ్లర్లు పట్టుకునేందుకు ప్రయత్నించగా.. బ్యాగ్‌ను సముద్రంలోకి విసిరేసి పారిపోయారు. దీంతో సముద్రంలోకి దూకి బంగారాన్ని బయటకు తెచ్చారు కోస్ట్ గార్డ్ సిబ్బంది. ఇదంతా అచ్చం సినిమాలో లాగా చేజింగ్ జరిగింది. చివరకు స్మగ్లర్స్ పడేసిన బ్యాగ్‌లో 4 కేజీల 700 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. స్మగ్లర్స్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. శ్రీలంక నుంచి బంగారం తెస్తున్నారన్న పక్కా సమాచారంతో డీఆర్ఐ అధికారులు, కస్టమ్స్ అధికారులు.. రెండ్రోజుల పాటు స్పెషల్ ఆపరేషన్ జరిపి 32 కిలోల గోల్డ్ పట్టుకున్నారు. అది కూడా తమిళనాడు తీరంలోనే జరిగింది. శ్రీలంక నుంచి భారత్‌కు బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు నిఘా పెట్టగా.. తమిళనాడులోని మండపం ఫిషింగ్‌ హార్బర్‌ ప్రాంతంలో రెండు బోట్ల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. వాటిని వెంబడించగా.. తప్పించుకునే క్రమంలో ఓ పడవలోని ముగ్గురు స్మగ్లర్లు తమ వద్ద ఉన్న 11.6 కిలోల బంగారు కడ్డీలను సముద్రంలో విసిరేశారు.

ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా డైవర్లను రంగంలోకి దించి సముద్రంలో పారేసిన బంగారాన్ని వెలికితీశారు. మరో పడవలో 21 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం రూ.20 కోట్లకుపైగా విలువైన 32.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?