ముంబై విమానాశ్రయంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ సీజ్ చేశారు అధికారులు. దాదాపు రూ.80 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 16 కిలోల హైగ్రేడ్ హెరాయిన్ ఓ ప్రయాణికుడి వద్ద నుంచి (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి భారత్‌కు డ్రగ్స్ సరఫరా చేసేందుకు అతడు భారీగా కమీషన్ తీసుకున్నట్టుగా గుర్తించారు. ప్రయాణికుడ్ని అనుమానించి తనికీ చేయగా డ్రగ్స్ దందా వెలుగుచూసింది. అధికారులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడి వద్ద నుంచిహైగ్రేడ్ హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు పరిశీలించగా..
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇన్వెస్టిగేషన్ (డీఆర్‌ఐ) అధికారులు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్‌తో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 16 కిలోల హైగ్రేడ్ హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.80 కోట్లకు పైగా ఉంటుందని డీఆర్‌ఐ తెలిపింది. అరెస్టయిన వ్యక్తి కేరళకు చెందిన పిను జాన్‌గా గుర్తించారు. డీఆర్‌ఐ అధికారులకు అందిన సమాచారం మేరకు పీనూ జాన్ విమానాశ్రయానికి చేరుకోగా.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. అధికారులు అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అతని వస్తువులను సోదా చేశారు. అప్పుడు ఒక ట్రాలీ బ్యాగ్‌లో ఏర్పాటు చేసిన సీక్రెట్ పాకెట్‌లో దాచి తీసుకొచ్చిన డ్రగ్స్ బయటపడింది.
పిను జాన్‌ని డీఆర్‌ఐ అధికారులు విచారించగా..ఈ డ్రగ్ భారత్‌కు తీసుకెళ్లేందుకు ఓ విదేశీయుడు వెయ్యి అమెరికన్ డాలర్లు కమీషన్‌గా ఇచ్చాడని విచారణలో చెప్పినట్టు అధికారులు తెలిపారు. అందులో పాల్గొన్న వారి పేర్లను కూడా జాన్ ప్రస్తావించాడు. దీంతో అధికారులు జాన్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం