లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ మిసైల్ రెడీ !

దేశీయంగా తయారైన ట్యాంక్ విధ్వంసక మిసైల్ ని డీఆర్ డీఓ గురువారం విజయవంతంగా పరీక్షించింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో గల అర్జున్ ట్యాంక్ రేంజి నుంచి ఈ క్షిపణిని పరీక్షించినట్టు ఈ సంస్థకు చెందిన వర్గాలు వెల్లడించాయి.

లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ మిసైల్ రెడీ !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 01, 2020 | 8:48 PM

దేశీయంగా తయారైన ట్యాంక్ విధ్వంసక మిసైల్ ని డీఆర్ డీఓ గురువారం విజయవంతంగా పరీక్షించింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో గల అర్జున్ ట్యాంక్ రేంజి నుంచి ఈ క్షిపణిని పరీక్షించినట్టు ఈ సంస్థకు చెందిన వర్గాలు వెల్లడించాయి. ఈ మిసైల్ రేంజి 5 కి.మీ. గతః నెల 22 న మొదటిసారి సక్సెస్ ఫుల్ ట్రయల్ అనంతరం మళ్ళీ పూర్తి స్థాయిలో ఈక్షిపణి ప్రయోగం జరిగిందని, రక్షణ శాఖ తమను అభినందించిందని ఈ వర్గాలు తెలిపాయి.  ప్రధాని మోదీ  పేర్కొన్న ఆత్మ నిర్భర్ నినాదం మేరకు ఇక దేశేయంగానే ఈ విధమైన మిసైల్స్ ఉత్పత్తి అవుతాయని డీ ఆర్ డీ ఓ శాస్త్రజ్ఞులు వెల్లడించారు. భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు రేగిన నేపథ్యంలో ఇలాంటి లేజర్ గైడెడ్ యాంటీ టాంక్ ల అవసరం ఎంతయినా ఉంటుందని అంటున్నారు.