DRDO: డీఆర్‌డీవో కీర్తి కిరీటంలో మరో ఘనత.. కేవలం 45 రోజుల్లో 7 అంతస్తుల అద్భుత భవనం..
DRDO New Recordడీఆర్‌డీవో మరో ఘనత సాధించింది. కేవలం 45 రోజుల వ్యవధిలో అద్భుతం చేసింది. డీఆర్‌డీవో పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు రక్షణ శాఖ అధికారులు, నెటిజన్లు. ఇంతకీ డీఆర్‌డీవో ఏం చేసింది.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(DRDO) తన సత్తాను మరోసారి నిరూపించుకుంది. ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ కోసం బహుళ-అంతస్తుల భవన నిర్మాణాన్ని కేవలం 45 రోజుల్లో పూర్తి చేసి ఔరా అనిపించింది. ఈ ఏడంతస్తుల భవనాన్ని బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ వద్ద నిర్మించింది DRDO. ఈ భవనాన్ని సంప్రదాయ, ప్రీ-ఇంజనీరింగ్, ప్రీకాస్ట్ మెథడాలజీతో కూడిన హైబ్రిడ్ టెక్నాలజీతో పూర్తి చేసింది. స్వదేశీ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రోగ్రాం కోసం నిర్మించిన ఈ భవనాన్ని, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఏవియోనిక్స్ అభివృధికి వినియోగించనున్నారు. ఇది స్వదేశీ ఏఎంసీఏ రీసెర్చ్ అండ్ డెలవలప్‌మెంట్ సౌకర్యాలను అందిస్తుంది. ఈ ఏడంతస్తుల భవనాన్ని బెంగళూరులో ప్రారంభించారు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఈ భవనంలోనే ప్రాజెక్ట్‌పై ప్రజెంటేషన్ ఇచ్చారు డిఆర్‌డివో అధికారులు.
కేవలం 45 రోజుల తక్కువ వ్యవధిలో నిర్మించిన ఈ బిల్డింగ్‌లో, కాంపోజిట్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ ద్వారా మౌలిక సదుపాయాలు అందిచాలని సూచించారు కేంద్రమంత్రి. ఈ ప్రాజెక్ట్‌కు నవంబర్ 22, 2021న శంకుస్థాపన జరిగిందని, నిర్మాణం ఫిబ్రవరి 1, 2022న ప్రారంభమైందని వివరించారు DRDO అధికారులు. హైబ్రిడ్ నిర్మాణ సాంకేతికతతో ఏడు అంతస్తుల శాశ్వత భవనాన్ని పూర్తి చేయడం రికార్డు అని చెబుతున్నారు నిపుణులు.
దేశ నిర్మాణ పరిశ్రమ చరిత్రలో ఇదే తొలిసారి అని అంటున్నారు అధికారులు. అంతేకాదు ఇది సాంప్రదాయ నిర్మాణంతో పోలిస్తే, సమయం, శ్రమను తగ్గిస్తుందని వివరిస్తున్నారు. ఈ అత్యాధునిక భవనంలో విద్యుత్ వ్యవస్థ, ఫైర్ ప్రోటెక్షన్ తోపాటు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కూడా ఉంటుందని చెబుతున్నారు ఆఫీసర్లు.
ఈ భవన నిర్మాణం అన్ని నిబంధనలకు లోబడే ఉందని స్పష్టం చేశారు. దీని నిర్మాణంలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కీ బృందాలు సాంకేతిక సహాయాన్ని అందించాయని వెల్లడించారు డీఆర్‌డీవో అధికారులు.
ఇవి కూడా చదవండి: ఈ ఫోటోలో పిల్లి స్టెప్స్ ఎక్కుతోందా? దిగుతోందా?.. కనుక్కుంటే మీరు జీనియస్.
Health Benefits: చిటికెడు నల్ల ఉప్పుతో ఎన్నో చిక్కు సమస్యలకు చెక్ పెట్టండి.. ఎలానో తెలుసా..