కంబోడియాలో భారత రాయబారిగా దేవయాని ఖోబ్రగడే
దేవయాని ఉత్తం ఖోబ్రగడే గుర్తున్నారా? ఓ ఏడేళ్ల కిందట జరిగిన ఘటన గుర్తున్నదా? న్యూయార్క్‌లో భారత దౌత్య కార్యాలయంలో డిప్యూటీ కౌన్సిల్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న దేవయాని...
దేవయాని ఉత్తం ఖోబ్రగడే గుర్తున్నారా? ఓ ఏడేళ్ల కిందట జరిగిన ఘటన గుర్తున్నదా? న్యూయార్క్‌లో భారత దౌత్య కార్యాలయంలో డిప్యూటీ కౌన్సిల్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న దేవయాని తన పనిమనిషి విషయంలో తమకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపిస్తూ అమెరికా అధికారులు ఆమెను అరెస్ట్ చేసి అవమానకరంగా ప్రవర్తించిన సంగతిని ఎవరు మాత్రం మర్చిపోతారు..? ఇప్పుడామె ప్రస్తావన ఎందుకంటే… దేవయాని ఉత్తం ఖోబ్రగడే ను కంబోడియా భారత రాయబారిగా నియమించింది భారత ప్రభుత్వం.. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆమె నియామకాన్ని ధృవీకరించింది.. 1999 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్-ఐఎఫ్‌ఎస్‌కు చెందిన దేవయాని.. ప్రస్తుతం ఢిల్లీలోని విదేశాంగా మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు. దాదాపు 21 సంవత్సరాల కెరీర్‌లో దేవయాని.. బెర్లిన్, ఇస్లామాబాద్, రోమ్, న్యూయార్క్‌లోని భారతీయ మిషన్లలో పనిచేశారు.