ప్లీజ్ మమ్మల్ని అలా పిలవకండి..!.. ఈ అమ్మాయిల గోడు వినండి..
కరోనా.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచాన్ని వణకిస్తోంది. చైనాలోని వూహాన్ పట్టణంలో పుట్టిన ఈ మహమ్మారి.. ప్రపంచ దేశాలన్నింటిని గజగజ వణికిస్తోంది. అప్పటి నుంచి చైనీయులు ఎక్కడ కనిపించినా.. వారిని అంటరాని వాళ్లలా చూస్తూ దూరం ఉంటున్నారు. అంతేకాదు.. మరికొందరైతే.. వారు ఎక్కడ కనిపిస్తే అక్కడ కరోనా కరోనా అంటూ అరుస్తున్నారట. అయితే ఇతర ప్రాంతాల వారు.. ఎవరైనా చైనీయుల్లా కనిపించినా కూడా అలానే అరుస్తున్నారట. మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాల ప్రజల కూడా చైనీయుల్లా పోలి ఉంటారు. […]
కరోనా.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచాన్ని వణకిస్తోంది. చైనాలోని వూహాన్ పట్టణంలో పుట్టిన ఈ మహమ్మారి.. ప్రపంచ దేశాలన్నింటిని గజగజ వణికిస్తోంది. అప్పటి నుంచి చైనీయులు ఎక్కడ కనిపించినా.. వారిని అంటరాని వాళ్లలా చూస్తూ దూరం ఉంటున్నారు. అంతేకాదు.. మరికొందరైతే.. వారు ఎక్కడ కనిపిస్తే అక్కడ కరోనా కరోనా అంటూ అరుస్తున్నారట. అయితే ఇతర ప్రాంతాల వారు.. ఎవరైనా చైనీయుల్లా కనిపించినా కూడా అలానే అరుస్తున్నారట.
మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాల ప్రజల కూడా చైనీయుల్లా పోలి ఉంటారు. అందుకు కారణం.. చైనాకు దగ్గరగా ఉండటంతో పాటుగా.. అక్కడి వాతావరణ పరిస్థితులు ఓ కారణం. ఇప్పుడు అదే వారి పాలిట శాపంగా మారింది. చైనీయుల పోలికలతో ఉన్న ఈశాన్య రాష్ట్రాల వారు ఎక్కడ కనిపించినా.. ఇతరులు దూరం పెడుతున్నారట. అంతేకాదు వారిని చూస్తూ..‘కరోనా’ కరోనా అంటూ పిలుస్తున్నారట. పంజాబ్‌లో నివసిస్తున్న విద్యార్ధులకు కొందరికి ఈ అనుభవం ఎదురైంది. దీంతో ఆవేదనకు గురైన వారంతా.. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేస్తూ వారి ఆవేదన పంచుకున్నారు.
చైనీయులుగా ఉన్నామంటూ తమను దూరం పెడుతున్నారని.. స్నేహితులు కూడా తమను దగ్గరకు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామంతా చైనా వాళ్లం కాదని.. తమపై వివక్ష చూపొద్దంటూ వాపోయారు. ఈశాన్య రాష్ట్రాల భౌగోళిక స్వరూపం ఎలా ఉంటుందో తెలియకపోతే..ఓసారి మనదేశ చిత్రపటాన్ని చూడలంటూ కోరారు. తామంతా భారతీయులమని, తమను అలా కరోనా కరోనా అని పిలవొద్దని వేడుకున్నారు.