కరోనా ఎఫెక్ట్: ఉజ్జయిని మహాకాళి ఆలయం మూసివేత

వైరస్ నేపథ్యంలో ఉజ్జ‌యినిలోని మహాకాళి ఆలయంపై కూడా వైరస్ ప్రభావం పడింది. మ‌హాకాలేశ్వ‌రుడి ఆల‌యంలో ఇవాళ భ‌క్తులు లేకుండానే ...

కరోనా ఎఫెక్ట్: ఉజ్జయిని మహాకాళి ఆలయం మూసివేత
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 17, 2020 | 11:19 AM

కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా అనేక రాష్ట్రాలు పాఠశాలలు, సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్స్‌ను మూసివేస్తున్నాయి. తెలంగాణా, మహారాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగానే తాజాగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు కూడా సెలవులు ప్రకటించాయి. వైరస్ నేపథ్యంలో ప్ర‌ఖ్యాత ఆల‌యాలు కూడా కొన్ని గైడ్స్‌లైన్స్ జారీ చేశాయి. భ‌క్తులు భారీ సంఖ్య‌లో రాకుండా ఉండేందుకు సూచ‌న‌లు చేశాయి. ఈ క్రమంలోనే ఉజ్జ‌యినిలోని మహాకాళి ఆలయంపై కూడా వైరస్ ప్రభావం పడింది. మ‌హాకాలేశ్వ‌రుడి ఆల‌యంలో ఇవాళ భ‌క్తులు లేకుండానే భ‌స్మ హార‌తి నిర్వ‌హించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో గల పురాతన మహంకాళీ దేవాలయాన్ని మూసివేశారు. మంగళవారం మహంకాళీ దేవాలయంలో పూజారులు భస్మహారతి పూజలు చేశారు. ఉజ్జయిని దేవాలయంలో మార్చి 31 వతేదీ వరకు భక్తులను అనుమతించకుండా పూజారులతో భస్మ హారతి నిర్వహించాలని మహంకాళేశ్వర్ దేవాలయ కమిటీ నిర్ణయించింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 114కి చేరిన నేపథ్యంలో ముంబై నగరంలోని సిద్ధి వినాయక దేవాలయాన్ని మూసివేశారు. మళ్లీ ప్రకటించేవరకూ సిద్ధివినాయక ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయకమిటీ పేర్కొంది. పంజాబ్‌లో ఉన్న గోల్డెన్ టెంపుల్ వ‌ద్ద కూడా ఆంక్ష‌లు విధించారు. అమృత్‌స‌ర్‌లో ఆల‌య సంద‌ర్శ‌న‌కు వ‌స్తున్న భ‌క్తులకు గురుద్వారా ప్ర‌బంద‌క్ క‌మిటీ శానిటైజ‌ర్ల‌ను అంద‌జేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలోని పలు దేవాలయాల్లో భక్తుల రాకపై ఆంక్షలు విధించారు.