యువ ఫుట్‌బాల్ కోచ్‌ని మింగేసిన కరోనా
జలుబు, జ్వరం వంటి లక్షాణాలతో మొదలవుతున్న ఈ వైరస్.. కొద్దిరోజులకే ప్రాణాలను హరించివేస్తుంది. దీనికి అందరూ అతీతులే అన్నట్లుగా దేశాధ్యక్షుల నుంచి సామాన్యులను సైతం వణికిస్తోంది. తాజాగా ఓ ప్రముఖ ఫుట్‌బాల్...
మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తొలుత చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ వైరస్ వేగంగా విస్తరిస్తూ..ఇతర దేశాలకు పాకింది. జలుబు, జ్వరం వంటి లక్షాణాలతో మొదలవుతున్న ఈ వైరస్.. కొద్దిరోజులకే ప్రాణాలను హరించివేస్తుంది. దీనికి అందరూ అతీతులే అన్నట్లుగా దేశాధ్యక్షుల నుంచి సామాన్యులను సైతం వణికిస్తోంది. తాజాగా ఓ ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ వైరస్ బారిన పడి మృతిచెందాడు.
ప్రపంచాన్ని అతలాకుతం చేస్తున్న కొవిడ్-19 ప్రభావం అందరి మీద పడుతుంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ క్రీడా క్యాలెండర్ మొత్తం మారిపోయింది. అయితే ఇప్పుడు ఈ కరోనా భారిన పడిన ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ మరణించాడు. 21 ఏళ్ల స్పానిష్ ఫుట్‌బాల్ కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా మాలాగాలో కరోనా కారణంగా మృతిచెందాడు. అయితే తీవ్రమైన కరోనావైరస్ లక్షణాలతో ఆసుపత్రికి వెళ్లిన తరువాత గార్సియా కు లుకేమియా కూడా ఉన్నట్టుగా నిర్ధారించారు వైద్యులు. అయితే ఈ యువ కోచ్ మరణం గురించి అట్లెటికో పోర్టాడా ఆల్టా సోషల్ మీడియాలో ఎమోషనల్ స్టేట్మెంట్ విడుదల చేసింది. అందులో ”అట్లెటికో కోటాడా ఆల్టా నుండి, మమ్మల్ని విడిచిపెట్టిన మా కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా కుటుంబానికి, స్నేహితులకు మరియు బంధువులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయాలనుకుంటున్నాము…ఇప్పుడు మీరు లేకుండా మేము ఏం చేస్తాము, ఫ్రాన్సిస్? లీగ్‌లో గెలవడం ఎలాగో మాకు తెలియదు, కాని మేము మీ కోసం దానిని సాధిస్తాము. మేము నిన్ను మరచిపోలేము ఇక విశ్రాంతి తీసుకోండి ఎప్పటికీ ” అంటూ షేర్ చేశారు. వైరస్ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ ను రెండు వారాల పాటు వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి: