Breaking: నాలుగో కరోనా పాజిటివ్ కేసు..!

దేశాలు దాటుకుని భారత్‌లోకి ప్రవేశించిన వైరస్...తెలుగు రాష్ట్రాల ప్రజలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో మూడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా రాష్ట్రంలో నాలుగో కోవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదైనట్లుగా సమాచారం..

Breaking: నాలుగో కరోనా పాజిటివ్ కేసు..!
Follow us

|

Updated on: Mar 17, 2020 | 1:05 PM

కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. దేశాలు దాటుకుని భారత్‌లోకి ప్రవేశించిన వైరస్…తెలుగు రాష్ట్రాల ప్రజలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో మూడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా రాష్ట్రంలో నాలుగో కోవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదైనట్లుగా సమాచారం.

రాష్ట్రంలో మరో కరోనా కేసు నమోదుకావడం కలకలం రేపుతోంది. స్కాట్లాండ్‌ నుంచి వచ్చిన 46 ఏళ్ల వ్యక్తికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం అతడు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. వ్యాపార నిమిత్తం ఆయన ఈ నెల 7న హైదరాబాద్‌ నుంచి స్కాట్లాండ్‌ వెళ్లినట్లుగా తెలిసింది. 13న స్కాట్లాండ్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకు్న అతడు15న కోవిడ్‌ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన నలుగురిలో మహేంద్రహిల్స్‌కు చెందిన యువకుడు చికిత్స తర్వాత పూర్తిగా కోలుకోవడంతో ఇటీవల డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో ఇటలీ నుంచి వచ్చిన యువతి నెదర్లాండ్‌ నుంచి వచ్చిన మరో వ్యక్తి చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ముగ్గురు పాజిటివ్‌ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. ఇదే ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో మరో 20 మంది కోవిడ్‌ అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. వీరి కోవిడ్‌ పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది. కాగా, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌కుమార్‌ ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్‌తో పాటు అన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. హైరిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 22 మందిని వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హరిత హోటల్‌కు తరలించారు. వీరు చైనా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, దక్షిణ కొరియాల నుంచి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఆయా దేశాల నుంచి వచ్చిన దాదాపు 107 మంది వైద్యాధికారుల ఉన్నట్లుగా సమాచారం.

read this story also: రూ.2 వేల నోటుపై కొత్త ప్రకటన !