Dog Video: మార్చురీలో యాజమాని కోసం పెంపుడు కుక్క ఏం చేసిందంటే..
కుక్కలు చాలా విశ్వాసపాత్రను పోషిస్తాయి. ఇంట్లో పెంచుకునే వారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. తాను పెట్టిన ఒక్క ముద్దకు, ముద్దుకు జీవితాంతం రుణపడి ఉంటాయి. తన ఇంటికి రక్షణ వలయంలా కాపలాకాస్తాయి. ఎవరైనా కొత్త వారు వచ్చారా అంతే సంగతి. దీంతో దొంగలు కూడా బయపడి కుక్కలు ఉన్న ఇండ్లకు పోయేందుకు ఆలోచిస్తారు. అయితే కేరళలో ఒక కుక్క ఇంతటితో సరిపెట్టక మరో హృదయ విదారక ఘటనకు కారణం అయింది. కన్నూర్ జిల్లా ఆసుపత్రి వద్ద

కుక్కలు చాలా విశ్వాసపాత్రను పోషిస్తాయి. ఇంట్లో పెంచుకునే వారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. తాను పెట్టిన ఒక్క ముద్దకు, ముద్దుకు జీవితాంతం రుణపడి ఉంటాయి. తన ఇంటికి రక్షణ వలయంలా కాపలాకాస్తాయి. ఎవరైనా కొత్త వారు వచ్చారా అంతే సంగతి. దీంతో దొంగలు కూడా బయపడి కుక్కలు ఉన్న ఇండ్లకు పోయేందుకు ఆలోచిస్తారు. అయితే కేరళలో ఒక కుక్క ఇంతటితో సరిపెట్టక మరో హృదయ విదారక ఘటనకు కారణం అయింది. కన్నూర్ జిల్లా ఆసుపత్రి వద్ద గత నాలుగు నెలలుగా మరణించిన అతని మాస్టర్ కోసం ఒక కుక్క వేచి ఉంది. ఆయన చనిపోయాడన్న విషయం తెలియక అక్కడే ఉండిపోయింది. ఈ కుక్క ఎవరితో వచ్చిందో ఎవరికీ తెలియదు. కానీ ఆసుపత్రి సిబ్బంది వికాస్ కుమార్ అది రోగితో వచ్చిందని చెప్పారు.
ఆయన మాట్లాడుతూ, “నాలుగు నెలల క్రితం ఒక రోగి ఆసుపత్రికి వచ్చాడు, రోగితో పాటు కుక్క కూడా వచ్చింది, తన యజమానిని మార్చురీకి తీసుకువెళుతుండగా కుక్క చూసింది. ఆయన ఇంకా ఇక్కడే ఉన్నాడని కుక్క భావిస్తుంది. అందుకే ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళలేదు. గత నాలుగు నెలలుగా ఇక్కడ ఉంది.” అని చెప్పుకొచ్చాడు. ఇక్కడ కుక్కకు తెలియని విషయం ఏమిటంటే.. తన యాజమానిని లోనికి తీసుకెళ్లిన దృశ్యం మాత్రమే గుర్తుంది. దీనికి కారణం ఆ ఘటనను కళ్లారా చూసింది కాబట్టి.
అయితే మృతదేహాలను మరో ద్వారం గుండా బయటకు పంపించేశారు అన్న విషయం దానికి తెలియదుకాబోలు పాపం. అందుకే తన యజమాని వస్తాడని ఆశతో ఎదురుచూస్తోంది. అతని మృతదేహాన్ని లోనికి తీసుకెళ్లిన తలుపు గుండానే తిరిగి బయటకు తీసుకొస్తారని భావించి ఉండవచ్చు అని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. ఆలా ఆసుపత్రి బయట ఉన్న కుక్కను ఒక మహిళ పెంచుకోవడం ప్రారంభించింది. ఆమె కుక్కకు ‘రాము’ అని పేరు పెట్టిందని ఆసుపత్రిలోని మరో సిబ్బంది తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆసుపత్రిని సందర్శించినప్పుడు కూడా రాము తన మాస్టర్ కోసం వేచి ఉన్నట్లు తెలిపారు. మేము ప్రతి రోజూ కుక్కలకు ఆహారం ఇస్తూ ఉంటాము ”అని ఒక మహిళా సిబ్బంది చెప్పారు.
కుక్కలకు, మానవులకు మధ్య సంబంధం కొన్నేళ్ల నాటిది. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. బ్రతికున్నప్పుడే రక్త సంబంధీకులను వదులుకుంటున్నారు కొందరు. ఆస్తుల కోసం కొట్లాడుకొని కుటుంబ బంధాలను తెగదెంపులు చేసుకుంటున్న ఈ సమాజంలో.. ఒక పెంపుడు కుక్క తన యజమాని కోసం మార్చురీ ముందు వేచి ఉంది. ఇది నిజమైన బంధం, అనుబంధం అంటే అని గొప్ప సందేశాన్ని ఇచ్చింది. విశ్వాసపాత్రకు మారుపేరైన కుక్క మరోసారి తన గుణాన్ని చాటుకుంది.
కుక్కలకు సహజంగానే వాసనను పసిగట్టగల గుణం ఉంటుంది. తమ యాజమానులను, పెంచిన వారిని, దగ్గరి వారిని అతి సులువుగా గుర్తు పెట్టుకుంటాయి. ఈ సందర్భంగా జపాన్‌లోని టోక్యోలో షిబుయా స్టేషన్ వెలుపల వేచి ఉన్న హచికో కథను గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ కథలో కూడా ఒక కుక్క తన యాజమాని కోసం స్టేషన్ వెలుపలకు పరిగెత్తుకుంటూ వస్తుంది. దీనికి సమానంగా ఉంది కేరళ ఆసుపత్రిలోని ఈ సంఘటన. అది ప్రజల హృదయాలను చలింపజేసేలా ఉంటుంది. జపాన్‌లో ఈ ప్రదేశం అత్యంత ప్రసిద్దికెక్కింది. అక్కడ నేటికీ పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. పెద్ద హౌండ్ విగ్రహాన్ని కూడా నమ్మకానికి ప్రతీకగా నిర్మించారు. ప్రస్తుతం సమావేశ ప్రదేశంగా ప్రసిద్దికెక్కింది.
#WATCH | Kerala: "A patient came to the hospital four months ago and the dog had come along with the patient. The patient died and the dog saw the owner being taken to the mortuary…The dog feels that the owner is still here. The dog does not leave this place & has been here for… pic.twitter.com/ltaObviLn3
— ANI (@ANI) November 5, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








