AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓర్నీ ఇదెక్కడి వింత.. కుక్కకు ఆధార్‌ కార్డు క్రియేట్‌ చేసిన యజమాని.!.. వైరల్‌ అవుతున్న ఫోటోస్!

సాధారణంగా ఆధార్‌ కార్డు అనేది ఒక వ్యక్తి గుర్తింపులు తెలియజేసే గుర్తింపు పత్రం. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఇప్పుడు ఈ కార్డు ఉంది. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం తన కుక్కకి కూడా ఆధార్‌ కార్డును క్రియేట్‌ చేశాడు. అందులో దాని పుట్టిన తేదీతో పాటు దాని తండ్రి పేరు కూడా ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు.

ఓర్నీ ఇదెక్కడి వింత.. కుక్కకు ఆధార్‌ కార్డు క్రియేట్‌ చేసిన యజమాని.!.. వైరల్‌ అవుతున్న ఫోటోస్!
Dog Adharcard
Anand T
|

Updated on: Sep 01, 2025 | 2:49 PM

Share

మనుషులకు ఆధార్ కార్డు ఇస్తారని అందరికీ తెలుసు.. కానీ మీరు ఎప్పుడైనా కుక్కకు ఆధార్ కార్డును ఇవ్వడం చూశారా? అవును మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం ఆధార్ కార్డును తయారు చేశాడు. ఇందులో విశేషమేమిటంటే ఆధార్ కార్డులో కుక్క చిత్రంతో పాటు దాని పుట్టిన తేదీ, దాని పేరు, తండ్రి పేరు కూడా ఉన్నాయి. కుక్క చిరునామా కూడా దానిపై ఉంది.

ఈ ఆధార్ కార్డులో కుక్క పేరు టామీ జైస్వాల్, తండ్రి పేరు కైలాష్ జైస్వాల్, వార్డు నంబర్ వన్ సిమారియా తాల్ గ్వాలియర్ మధ్యప్రదేశ్ అని రాసి ఉంది. అలాగే దాని పుట్టిన తేదీ కూడా 25/12/2010 అని వ్రాయబడింది. దీనితో పాటు, ఆధార్ కార్డు నంబర్ కూడా 070001051580, ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Dog Adharcard

 

ఆధార్ కార్డులు తయారు చేసే వారిపై చర్యలు?

ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కుక్కకు ఆధార్‌ కార్డు ఎలా ఇచ్చారనే ప్రశ్నలు తలెత్తాయి. అసలు ఈ ఆధార్‌కార్డును ఎవరు తయారు చేశారు. ఏ ఉద్దేశంతో తయారు చేశారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై అధికారులు ఇంతవరకు స్పందచనట్టు తెలుస్తోంది. ఒక వేళ ఇది అధికారుల దృష్టికి వెళ్తే వాళ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.