Viral Video: టికెట్ లొల్లి.. ప్రయాణికుడి చెంప పగలకొట్టిన బస్సు కండక్టర్..! ఏకి పారేస్తున్న నెటిజన్లు.. వీడియో
టికెట్ వివాదం చిరిగి చిరిగి చాపంత అయ్యింది.. కండక్టర్ ప్రయాణికుడిని చెంప దెబ్బ కొట్టడంతో.. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని దేవనహళ్లి నుండి మెజెస్టిక్ కు వెళ్తున్న బీఎంటీసీ బస్సులో గత గురువారం (ఆగస్ట్ 28) చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి..

దేవనహళ్లీ, సెప్టెంబర్ 1: టికెట్ తీసుకోలేదన్న నెపంతో ఓ బస్సు కండక్టర్.. ప్రయాణికుడిని చెంప దెబ్బ కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని దేవనహళ్లి నుండి మెజెస్టిక్ కు వెళ్తున్న బీఎంటీసీ బస్సులో గత గురువారం (ఆగస్ట్ 28) చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..
దేవనహళ్లి నుంచి బెంగళూరు మెజెస్టిక్‌కి వెళ్తున్న బీఎంటీసీ బస్సు (KA‑57 F‑4029 )లో ఓ యువకుడు బస్సు ఎక్కాడు. అయితే కండక్టర్ వస్తాడని సదరు యువకుడు వేచి చూస్తున్నాడు. ఇంతలో చెకింగ్ సిబ్బంది బస్సు ఎక్కి.. అందరి వద్ద టికెట్లు చెక్ చేశారు. సదరు యువకుడి వద్ద టికెట్ లేకపోవడం గమనించి ఫైన్ వేశారు. కండక్టర్ నిర్లక్ష్యం చేశాడని, టికెట్ ఇస్తాడని తాను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్లు ఆరోపించాడు. దీంతో కండక్టర్‌కి, ప్రయాణికుడికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపం కట్టలు తెంచుకున్న కండక్టర్ ప్రయాణికుడి చెంపపై కొట్టి దుర్బాషలాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో పక్కనే ఉన్న ఇతర ప్రయాణికులు రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
My friend was travelling from Devanahalli to majestic via BMTC bus KA-57 F-4029 The conductor didn’t come to take the ticket therefore my friend was also sitting idle By the time squad arrived for checking and fined him . Later this conductor came all of the sudden and assaulted pic.twitter.com/XFGBXBAyDo
— Shreyas Shet (@ShetShreyas) August 28, 2025
నేను దేవనహళ్లి నుంచి మెజెస్టిక్‌కు వెళ్లేందుకు BMTC బస్సు KA‑57 F‑4029లో ఎక్కాను. కండక్టర్ టికెట్ఇవ్వడానికి ఎంతకూ రాలేదు. దీంతో టికెట్ కోసం వెయిట్ చేస్తూ సీట్లో కూర్చుండిపోయాను. అదే సమయానికి స్క్వాడ్ తనిఖీ కోసం వచ్చి రూ.420 జరిమానా విధించాడు. దీంతో కండక్టర్ అకస్మాత్తుగా వచ్చి తనపై దాడి చేశాడని బాధితుడు వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే తాను మాత్రం కండక్టర్ ని తిరిగి కొట్టలేదని అన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని తన పోస్టు ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాడు. ఈ పోస్టు వైరల్ కావడంతో కండక్టర్ తీరును నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. సదరు కండక్టర్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, BMTC బస్సులలో టిక్కెట్ల ప్రక్రియను సక్రమంగా పర్యవేక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా BMTC సిబ్బంది ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఇదేం తొలిసారి కాదు. అధిక ఛార్జీలు వసూలు చేయడం, దురుసుగా ప్రవర్తించడం, నిర్లక్ష్యం, దాడికి సంబంధించిన సంఘటనలు గతంలో ఎన్నో జరిగాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




