కడుపు నొప్పి వస్తే మాములుగా అయితే గ్యాస్ వల్ల లేదా అజీర్తి వల్ల అనుకుంటారు. లేదా నులి పురుగులు లాంటివి ఉంటే డాక్టర్లు స్కాన్ చేసి మెడిసిన్ చేసి పంపిస్తారు. కడుపులో గడ్డ లాంటివి ఉంటే.. చిన్నది అయితే కరిగిపోతుందని మందులు రాస్తారు.. పెద్దది అయితే ఆపరేషన్ చేసి తీస్తారు. తాజాగా ఓ మహిళ విపరీతమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్లు వెంటనే స్కాన్ చేశారు. రిపోర్ట్ ఆధారంగా ఆమె కడుపులో ఏదో గడ్డ ఉందని భావించారు. సైజ్ పెద్దదిగా ఉండటంతో ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. అయితే ఆపరేషన్ చేస్తుండగా లోపలి ఉన్నది చూసి షాకయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక కొడగులోని మడికేరిలో డాక్టర్లు అరుదైన ఆపరేషన్ చేశారు. మహిళ కడపులో నుంచి కిలోన్నర వెంట్రుకలను బయటకు తీశారు. కొడగు మెడికల్ కాలేజీలో డాక్టర్ అజిత్ కుమార్ నేతృత్వంలోని టీమ్ గంటలపాటు శ్రమించి ఈ సర్జరీని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. కొద్ది రోజుల క్రితం ఓ మహిళ కడపునొప్పితో ఈ హాస్పిటల్‌లో చేరింది. స్కానింగ్ చేసిన డాక్టర్లు ఆమె కడుపులో గడ్డ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆమెకు ఆపరేషన్ చేశారు. కడుపులో వెంట్రకలతో ఏర్పడిన కేజీన్నర గడ్డను తొలగించారు. వెంట్రుకల్లాంటి పదార్థంతో అది ఏర్పడినట్లు గమనించారు. ఆ మహిళ వెంట్రుకలు తినే అరుదైన మానసిక వ్యాధి ‘ట్రికపేజియాతో’ బాధపడుతున్నట్లు సర్జరీ అనంతరం డాక్టర్లు విశ్లేషించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వివరించారు. కాగా ట్రికపేజియా అనేది మానసిక రోగం. ఈ వ్యాధి ఉన్నవారు తరచూ తమ వెంట్రుకలను తింటూ ఉంటారు.
Also Read: “చావనైనా చస్తామ్ కానీ, ఈ వాహనాన్ని పోనివ్వం”.. ఇంతకీ అందులో ఏమున్నాయ్
48 వేల మందికి ఉద్యోగాలు.. ఆ రంగంలో కీలక ప్రాజెక్టులకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్