AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిడ్నీ ఫెయిల్‌కి ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌కి సంబంధం.. వైద్య పరీక్షలో తేలిన సంచలన నిజం.

అందాన్ని పెంచుకునేందుకు ఫెయిర్‌ నెస్‌ క్రీమ్స్‌ను ఉపయోగించడం సర్వసాధారణమైన విషయం. అయితే వీటిలో ఉపయోగించే కొన్ని రసాయనాల వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. తాజాగా దేశ మహారాష్ట్రాలో జరిగిన ఓ సంఘటన ఒక్కసారిగా అందరినీ షాక్‌కి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన ఓ 20 ఏళ్ల అమ్మాయి..

కిడ్నీ ఫెయిల్‌కి ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌కి సంబంధం.. వైద్య పరీక్షలో తేలిన సంచలన నిజం.
Doctors
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 04, 2023 | 4:56 PM

అందాన్ని పెంచుకునేందుకు ఫెయిర్‌ నెస్‌ క్రీమ్స్‌ను ఉపయోగించడం సర్వసాధారణమైన విషయం. అయితే వీటిలో ఉపయోగించే కొన్ని రసాయనాల వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. తాజాగా దేశ మహారాష్ట్రాలో జరిగిన ఓ సంఘటన ఒక్కసారిగా అందరినీ షాక్‌కి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన ఓ 20 ఏళ్ల అమ్మాయి ఇటీవల ఓ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ను కొనుగోలు చేసింది. ఆ క్రీమ్‌ వాడడం ప్రారంభించినప్పటి నుంచి అందరూ ఆమె మరింత అందంగా కనిపిస్తోందని పొగడడం ప్రారంభించారు. దీంతో ఈ క్రీమ్‌ను ఆమె అక్కతో పాటు తల్లి కూడా ఉపయోగించడం ప్రారంభించారు.

అయితే ఈ క్రీము వాడడం ప్రారంభించిన నాలుగు నెలల తర్వాత ఆ అమ్మాయి అనారోగ్యం బారిన పడింది. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం వారు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. కిడ్నీలో ఉండే ఫిల్టర్స్‌ పనితీరు దెబ్బతిన్నట్లు వైద్యులు కనుగొన్నారు. అయితే ఈ వ్యాధి ఎందుకు వచ్చిందన్న దానిపై పరీక్షలు నిర్వహించిన వైద్యులకు ఊహించని విషయాలు తెలిశాయి. అసలు కిడ్నీల్లో సమస్య ఎందుకు వచ్చిందన్న విషయం తెలుసుకోవడానికి పరేల్‌లోని కేఈఎమ్‌ ఆసుపత్రికి షాంపిల్స్‌ పంపించారు. కేఈఎమ్‌ ఆసుపత్రిలో నెఫ్రాలజీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ డాక్టర్‌ తుకారం జమాలే, అకోలాకు చెందిన డాక్టర్‌ అమలర్ సుల్తాన్‌లు పరీక్షలు నిర్వహించిన అనంతరం కిడ్నీ సమస్యకు ఆమె ఉపయోగిస్తున్న ఫెయిర్‌ క్రీమే కారణమనే నిర్ధారణకు వచ్చారు.

ఫెయిర్‌ నెస్‌ క్రీమ్‌ తయారీలో పరిమితికి మించి ఉపయోగించిన మెర్క్యూరీ కారణంగానే కిడ్నీలు దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. సాధారణంగా మనుషుల రక్తంలో మెర్క్యూరి స్థాయిలు 7 పీపీఎమ్‌ కంటే తక్కువగా ఉండాలి. కానీ సదరు అమ్మాయి రక్తంలో మాత్రం ఆ సంఖ్య ఏకంగా 46గా ఉండడం గమనార్హం. మెర్క్యూరీ కిడ్నీలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇదిలా ఉంటే సౌందర్య సాధనాల్లో ఇలాంటి హెవీ మెటల్స్‌ కనుగొనడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2014లో ఢిల్లీకి చెందిన సీఎస్‌ఈ 32 క్రీముల్లో 14 హెవీ మెటల్స్‌ ఉన్నట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..