PM Modi: అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ.. 78శాతం ఆమోదంతో అగ్రస్థానం..

భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఖ్యాతి కైవసం చేసుకున్నారు. అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ ఈ వివరాలను వె...

PM Modi: అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ.. 78శాతం ఆమోదంతో అగ్రస్థానం..
Pm Modi
Follow us

|

Updated on: Feb 04, 2023 | 4:57 PM

భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఖ్యాతి కైవసం చేసుకున్నారు. అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ ఈ వివరాలను వెల్లడించింది. 78 శాతం ఆమోదంతో నరేంద్రమోడీ.. మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ గా అవతరించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, యూకే పీఎం రిషి సునాక్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మొత్తం 22 మంది గ్లోబల్ లీడర్లపై ఈ సంస్థ సర్వే చేసింది. గ్లోబల్ లీడర్ అఫ్రూవల్ సర్వే ఈ ఏడాది జనవరి 26-31 నుంచి సేకరించిన డేటా ఆధారం ఈ ర్యాకింగ్స్ ఇచ్చారు. ఒక్కో దేశంలో ప్రజల ఏడు రోజుల సగటును తీసుకుని ఈ నివేదికను తయారు చేశారు. ఈ సర్వేలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కు 40 శాతం ప్రజామోదం లభించింది. యుఎస్-ట్రాకింగ్ సంస్థ వెబ్‌సైట్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

78 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీని ఆమోదించారు. 18 శాతం మంది ఆయనను తిరస్కరించారు. ప్రధాని మోడీ ఆమోదం రేటింగ్ ఇటీవల పెరిగింది, జనవరి మూడో వారంలో 79 శాతానికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు జోబిడైన్ 7వ స్థానంలో ఉన్నారు. 22 దేశాల అధినేతల ర్యాకింగ్స్ లో నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సియోక్-యుల్ మరియు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా చివరి మూడు స్థానాల్లో ఉన్నారు.

మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 68 శాతం రేటింగ్‌లతో రెండో స్థానంలో, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ 62 శాతం ఆమోదం రేటింగ్‌తో మూడో స్థానం కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ 58 శాతం ఆమోదంతో 4వ స్థానంలో, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా 50 శాతం రేటింగ్‌లతో ఐదో స్థానంలో, ఇటలీకి ఇటీవల కొత్తగా ఎన్నికైన జాతీయవాద నాయకురాలు జార్జియా మెలోని 52 శాతం రేటింగ్ తో 6వ స్థానంలో, కెనడా ప్రధాని 40 శాతం ఆమోదాలతో 9వ స్థానంలో, యూకే ప్రధాని రిషి సునాక్ 30 శాతం ఆమోదాలతో 12వ స్థానంలో నిలిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..
మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.
మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!