Coronavirus: కరోనా వ్యాప్తి.. ఇకపై ఎక్కువగా ఆర్టీపీసీఆర్‌ టెస్టులే చేయండి.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సర్కార్ కీలక ఆదేశాలు..

కరోనా టెస్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కరోనా నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లనే...

Coronavirus: కరోనా వ్యాప్తి.. ఇకపై ఎక్కువగా ఆర్టీపీసీఆర్‌ టెస్టులే చేయండి.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సర్కార్ కీలక ఆదేశాలు..
Follow us

|

Updated on: Dec 14, 2020 | 9:37 AM

Coronavirus: కరోనా టెస్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కరోనా నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లనే ఎక్కువగా చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఆ మేరకు లేఖలు పంపింది. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో 60శాతానికి పైగా ఆర్టీపీసీఆర్ టెస్టులను నిర్వహించాలని, 40 శాతం లోపు ర్యాపిడ్ టెస్టులు చేపట్టానలి ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కరోనా వ్యాప్తి ఎక్కువగా సమయంలో నిర్ధారణ కోసం యాంటీజెన్ టెస్ట్‌లు చేసిన విషయం తెలిసిందే. అయితే వీటిలో కచ్చితత్వం అంతగా లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆర్టీపీఎసీఆర్ ద్వారానే నిర్ధిష్టమైన ఫలితాలు వస్తున్నాయి. ఎలాగూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, కొత్తగా నమోదైన కేసుల్లోనూ పెద్దగా లక్షణాలు లేనివే ఉండటంతో వ్యాధి నిర్ధారణలో కచ్చితత్వం కోసం ఆర్టీసీసీఆర్ పరీక్షలను చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఇటీవల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ఇదే విషయాన్ని తెలిపినట్లు సమాచారం.

Also Read:

హెల్త్ అలర్ట్… మీరు అతిగా స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా… అయితే మీపై ఈ దుష్ప్రభావం ఉండబోతోంది…

ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. నిర్ణయం మార్చుకున్న ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ.. ఈ నెల చివరికల్లా ఖాతాల్లో..