Tamil Nadu: ఎంపీ అనుచరుల వీరంగం.. చర్చి ఫాదర్ బిషప్‌పై తరుముకుంటూ కొట్టారు..!

తమ నాయకుడిని మిషనరీ సంస్థల్లో పదవి నుంచి తొలగించారనే కారణంతో డీఎంకే ఎంపీ జ్ఞానసంబంధం అనుచరులు రెచ్చిపోయారు. చర్చి పాధర్ బిషప్‌ని చుట్టుముట్టి దాడి చేశారు. వీరంగం సృష్టించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Tamil Nadu: ఎంపీ అనుచరుల వీరంగం.. చర్చి ఫాదర్ బిషప్‌పై తరుముకుంటూ కొట్టారు..!
Mp Gnanathiraviam

Updated on: Jun 28, 2023 | 7:21 AM

తమ నాయకుడిని మిషనరీ సంస్థల్లో పదవి నుంచి తొలగించారనే కారణంతో డీఎంకే ఎంపీ జ్ఞానసంబంధం అనుచరులు రెచ్చిపోయారు. చర్చి పాధర్ బిషప్‌ని చుట్టుముట్టి దాడి చేశారు. వీరంగం సృష్టించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అవినీతి ఆరోపణల కారణంగా తిరునల్వేలి జిల్లాలోని జూన్స్ కాలేజీలో ముఖ్యమైన పదవి నుంచి ఎంపీ జ్ఞానసంబంధంని తొలగించారు బిషప్ నోబెల్. స్థానిక చర్చికి సంబంధించిన భూములని ఎంపీ కబ్జా చేయడంపై చర్యలు తీసుకోవాలని, పార్టీ పదవుల నుంచి తొలగించాలని సీఎం స్టాలిన్‌కి కూడా ఫిర్యాదు చేశారు బిషప్‌ నోబెల్. ఎంపీ అవినీతి చిట్టాను స్టాలిన్‌కి వీడియో రూపంలో సెండ్‌ చేశారు.

బిషప్ నోబెల్ వీడియోపై ఆగ్రహించిన ఎంపీ అనుచరులు.. చర్చి పాధర్‌పైదాడి చేశారు. తరుముకుంటూ తన్నారు. చర్చిలో అడ్డోచ్చిన పలువురిఫై కూడా దాడికి పాల్పడ్డారు. గొడవ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో అటు క్రైస్తవ సంఘాలు ఎంపీపై చర్యలు తీసుకోవాలని, పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై డీఎంకే అధిష్టానం వెంటనే వివరణ ఇవ్వాలంటూ ఎంపీకి నోటీసులు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..