Odisha: రూ. 2 కోట్ల రూపాయలు… పక్కంటి మేడపైకి విసిరేశాడు.! చివరికి పట్టేసారుగా..
ఓ ప్రభుత్వాధికారి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడులకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఆ ఉద్యోగి తన ఇంట్లో ఉన్న కోట్ల రూపాయల నగదును పక్కింటి టెర్రాస్‌పైకి విసిరేశాడు. అయినా జరగాల్సిన కార్యం జరిగిపోయింది.
ఓ ప్రభుత్వాధికారి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడులకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఆ ఉద్యోగి తన ఇంట్లో ఉన్న కోట్ల రూపాయల నగదును పక్కింటి టెర్రాస్‌పైకి విసిరేశాడు. అయినా జరగాల్సిన కార్యం జరిగిపోయింది. అతను క్యాస్‌ను పక్కింటిపైకి విసరడం అప్పుడే అక్కడికి చేరుకున్న విజిలెన్స్ అధికారుల కంటపడింది. ఇంకేముంది? టక టకా అధికారులు ఆ ఇంటిని చుట్టుముట్టడం నగదును స్వాధీనం చేసుకోవడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.
ఒడిశాలోని నబరంగ్ పూర్ జిల్లాకు ప్రశాంత్ కుమార్ రౌత్ అదనపు సబ్ కలెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కలిగివున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దాంతో భువనేశ్వర్ లోని ఆయన నివాసంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. దాంతో, ప్రశాంత్ కుమార్ రౌత్ 2 కోట్ల నగదును పొరుగింటి టెర్రస్ పైకి విసిరేశాడు. ఈ విషయాన్ని గమనించిన విజిలెన్స్ అధికారులు పక్కింటి టెర్రస్ పైకి వెళ్లి 6 బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో నగదు కట్టలను గుర్తించారు. కాగా, ప్రశాంత్ కుమార్ రౌత్ అవినీతిపై పక్కా సమాచారంతో విజిలెన్స్ విభాగం ఏకకాలంలో 9 చోట్ల దాడులు జరిపింది. భువనేశ్వర్ లోని నివాసంతో పాటు, నబరంగ్ పూర్ లోని మరో ఇంటిలోనూ, ఆఫీసులోనూ, భద్రక్ జిల్లాలోని తల్లిదండ్రుల నివాసంలోనూ, ప్రశాంత్ కుమార్ కు చెందిన మరో 5 ప్రదేశాల్లోనూ సోదాలు జరిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..