Tamil Nadu: తమిళనాడు గవర్నర్‌ వర్సెస్‌ డీఎంకే.. సీఎన్‌ రవిని భర్తరఫ్‌ చేయాలంటూ సంతకాల సేకరణ..

|

Nov 02, 2022 | 3:07 PM

తమిళనాడులో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి వర్సెస్‌ అధికార పార్టీ డీఎంకే వ్యవహారం మరింత ముదిరింది. బీజేపీ ఏజెంట్‌లా గవర్నర్‌ రవి వ్యవహరిస్తున్నారని.. ఆయన్ను వెంటనే బర్తరఫ్‌ చేయాలని డీఎంకే మిత్రపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Tamil Nadu: తమిళనాడు గవర్నర్‌ వర్సెస్‌ డీఎంకే.. సీఎన్‌ రవిని భర్తరఫ్‌ చేయాలంటూ సంతకాల సేకరణ..
MK Stalin - RN Ravi,
Follow us on

తమిళనాడులో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి వర్సెస్‌ అధికార పార్టీ డీఎంకే వ్యవహారం మరింత ముదిరింది. బీజేపీ ఏజెంట్‌లా గవర్నర్‌ రవి వ్యవహరిస్తున్నారని.. ఆయన్ను వెంటనే బర్తరఫ్‌ చేయాలని డీఎంకే మిత్రపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గవర్నర్‌ రవిని బర్తరఫ్‌ చేయాలని డిమండ్‌ చేస్తూ డీఎంకే పార్టీ కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు మోమోరాండంపై సంతకాలు చేశారు. దీంతోపాటు విపక్షాలతో కలిసి సమావేశం నిర్వహించడానికి కూడా సమాయత్తమవున్నారు. తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్‌ఎన్‌ రవిని తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపనున్న మెమోరాండంపై సంతకం చేయాల్సిందిగా డీఎంకే అన్ని ప్రతిపక్షాలకు లేఖ రాసింది. దీనికి కాంగ్రెస్‌ అంగీకరించింది. ఈ మేరకు డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత టీఆర్‌ బాలు విపక్షాలన్నింటికీ లేఖ సైతం పంపించారు. దీనికి సీపీఐ, సీపీఎం కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. గవర్నర్‌ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా.. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ డీఎంకే ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.

ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ఏజెండాను తమిళనాడులో బలవంతంగా రుద్దేందుకు గవర్నర్‌ రవి ప్రయత్నిస్తున్నారని డీఎంకే, మిత్రపక్షాలు మండిపడుతున్నాయి. తమిళ రచయిత తిరువళ్లూరుపై గవర్నర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై డీఎంకే నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్‌ రవి ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ఏజెంట్‌లా మాట్లాడుతున్నారంటూ డీఎంకే నేత బాలు విమర్శించారు.

సనాతన ధర్మాన్ని పాటించాలనికోరడం ద్రవిడ సంస్కృతిని, దళితులను కించపర్చే విధంగా మాట్లాడడం గవర్నర్‌కు అలవాటుగా మారిందని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. హిందుత్వకు డీఎంకే వ్యతిరేకమని గవర్నర్‌ ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..