Odisha Train Accident: రైలు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన కేంద్ర మంత్రులు.. త్వరగా కోలుకోవాలంటూ.

|

Jun 04, 2023 | 7:42 PM

ఒడిశా రైలు ప్రమాదంలో గాయాలైన ప్రయాణికులు ప్రస్తుతం కోలుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారు. ప్రమాద బాధితులను వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించి, చికిత్సను ప్రారంభించారు. కటక్‌లోని ఎస్‌బీ మెడికల్‌ కాలేజీలో పెద్ద ఎత్తున వైద్యులు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు...

Odisha Train Accident: రైలు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన కేంద్ర మంత్రులు.. త్వరగా కోలుకోవాలంటూ.
Odisha Train Accident
Follow us on

ఒడిశా రైలు ప్రమాదంలో గాయాలైన ప్రయాణికులు ప్రస్తుతం కోలుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారు. ప్రమాద బాధితులను వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించి, చికిత్సను ప్రారంభించారు. కటక్‌లోని ఎస్‌బీ మెడికల్‌ కాలేజీలో పెద్ద ఎత్తున వైద్యులు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే గాయపడిన వారిని కేంద్ర మంత్రులు పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ క్షతగాత్రులను పరామర్శించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు.

ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు కేంద్ర మంత్రులు అశ్విన్‌ వైష్ణవ్‌, మన్షుక్‌ మాండవియాలు కూడా క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా గాయాలబారిన పడిన వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. దేశం మొత్తం మీ క్షేమాన్ని కోరుకుంటోందని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు క్షతగాత్రులకు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

ఇక ఒడిశా రైలు ప్రమాదం జరిగిన సమయంలో ఒడిశా పౌరులు స్పందించిన తీరుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రశంసలు కురిపించారు. ఒడిశా పౌరులు, సామాజిక సంస్థలు బాధితులకు సహాయం చేయడంలో చూపిన నిబద్ధత ఆదర్శనీయమైందన్నారు. గాయపడిన పౌరులకు వైద్య సహాయం అందించడంలో ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ సభ్యుల పనితీరు అద్భుతన్నారు. వారి నిస్వార్థ సేవను మంత్రి పొగిడారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..