AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DGCA: విమానాల్లో వెంటనే వాటిని చెక్ చేయండి.. విమాన సంస్థలకు డీజీసీఏ కీలక ఆదేశాలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో డీజీసీఏ అలర్ట్ అయ్యింది. మరోసారి అటువంటి ప్రమాదం జరగకుండా తగిన చర్యలు చేపడుతోంది. ఇంధన స్విచ్‌లు ఆఫ్ అవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ఏఏఐబీ ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో విమాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

DGCA: విమానాల్లో వెంటనే వాటిని చెక్ చేయండి.. విమాన సంస్థలకు డీజీసీఏ కీలక ఆదేశాలు
Ahmedabad Plane Crash
Krishna S
|

Updated on: Jul 14, 2025 | 7:56 PM

Share

అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేసింది. విమాన ప్రయాణం అంటేనే ఒకసారి ఆలోచించేలా చేసింది. ఏకంగా ఈ ప్రమాదంలో 270మందికి పైగా మరణించడం అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఈ ప్రమాదం.. మన దేశంలో విమాన ప్రయాణాలకు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. విమానంలోని ఇంజిన్ సమస్యల వల్లే ప్రమాదం జరిగిందని కొందరు అంటే.. పైలట్ల తప్పిదం వల్లే జరిగిందని మరికొందరు అంటున్నారు. అయితే విమానం ఇంజిన్‌లో ఎలాంటి సమస్యలు లేవని ఎయిరిండియా సీఈవో క్లారిటీ ఇచ్చారు. టేకాఫ్ సమయంలోనూ ఎటువంటి సమస్య తలెత్తలేదని చెప్పారు. మరోవైపు ఏఏఐబీ ప్రాథమిక విచారణలో ఇంధన స్విచ్‌లు ఆఫ్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని తేలింది. ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ జెట్లను నడుపుతున్న దేశీయ విమానయాన సంస్థలు ఆ విమానాల ఇంజిన్లకు ఇంధన సరఫరాను నియంత్రించే స్విచ్‌లను చెక్ చేయాలని ఆదేశించింది. ఈ నెల 21 వరకు ఈ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.

దేశంలోని అన్ని బోయింగ్ విమానాలకు చెకింగ్ తప్పనిసరి అని చెప్పింది. బోయింగ్ డ్రీమ్ లైనర్‌ను ఎయిరిండియా, ఇండిగో సంస్థలు మాత్రమే నడుపుతున్నాయి. విమానాలలో 787-8, 9 వేరియంట్‌లతో దాదాపు 30 విమానాలు ఎయిరిండియా వద్ద ఉన్నాయి. ఇండిగో 787-9ను ఇటీవలే నడపడం ప్రారంభించింది. ఎయిరిండియా తన డ్రీమ్‌లైనర్ ఫ్లీట్‌లో 50 శాతం తనిఖీలను పూర్తి చేశామని.. ఇంధన స్విచ్ లాకింగ్ మెకానిజంలో ఎటువంటి లోపాలు లేవని తెలిపింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ 737 మాక్స్ ఫ్లీట్‌లో చాలా వరకు తనిఖీలు పూర్తయ్యాయని, ఆ విమానాలలో కూడా ఎటువంటి లోపాలు లేవని కంపెనీ వర్గాలు తెలిపాయి.

డీజీసీఏ ప్రకటన తర్వాత ఎతిహాద్ ఎయిర్‌వేస్ సహా పలు ప్రధాన విమానయాన సంస్థలు డ్రీమ్‌లైనర్‌లను నడుపుతున్న పైలట్‌లకు కీలక సూచనలు ఇచ్చాయి. ఇంధన నియంత్రణ స్విచ్‌లను నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పాయి. యునైటెడ్ స్టేట్స్ ఏవియేషన్ రెగ్యులేటర్, ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ.. బోయింగ్ ఇంధన నియంత్రణ స్విచ్‌లు సురక్షితమైనవి అని నొక్కి చెబుతూ నోటిఫికేషన్‌లు జారీ చేశాయి. లాకింగ్ ఫీచర్‌తో సహా ఇంధన నియంత్రణ స్విచ్ డిజైన్ వివిధ బోయింగ్ విమానలలో ఒకే విధంగా ఉందని ఓ నివేదిక తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..