Swati Maliwal: దేశ రాజధానిలో సంచలనం.. ఏకంగా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌కే అత్యాచార బెదిరింపులు
హిందీ బిగ్‌బాస్ షోలో కాంట్రవర్సీ దర్శకుడు సాజిద్ ఖాన్‌ను తీసుకోవడంపై స్వాతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు సాజిద్‌ను షో నుంచి తీసివేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ లేఖ రాసింది.
ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మాలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా తనకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ఈమేరకు తనను బెదిరిస్తున్న వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని అటు మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికగా కోరారు. దీనిపై ఢిల్లీ పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. కాగా సాక్షాత్తూ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌కే రేప్ బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. కాగా హిందీ బిగ్‌బాస్ షోలో కాంట్రవర్సీ దర్శకుడు సాజిద్ ఖాన్‌ను తీసుకోవడంపై స్వాతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు సాజిద్‌ను షో నుంచి తీసివేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ లేఖ రాసింది. ఈ లేఖ రాసినప్పటి నుంచి తనకు సామాజిక మాధ్యమాల్లో అత్యాచార బెదిరింపులు వస్తున్నట్టు స్వాతి తెలిపారు. వారు తమ పనిని అడ్డుకోవాలని చూస్తున్నట్టు, అందుకే వారిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను కూడా ఆమె అటాచ్ చేశారు.
అలాంటి వారిని షోలోకి ఎలా తీసుకుంటారు?
కాగా మీటూ ఉద్యమం భాగంగా పలువురు నటీమణులు సాజిద్ ఖాన్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో 2018లోఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి ఏడాది పాటు ఆయనను సస్పెండ్ చేశారు. అంతేకాదు హౌస్‌ఫుల్ 4 సినిమా దర్శకుడిగానూ అప్పట్లో వైదొలిగారు. ఈ విషయాలన్నీ మరోసారి గుర్తు చేస్తూ స్వాతి కేంద్రమంత్రికి లేఖ రాసింది.
‘మీటూ ఉద్యమంలో సాజిద్ ఖాన్ పై దాదాపు 10 మంది అమ్మాయిలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. హౌస్ ఫుల్ 4, హుమ్‌షకల్స్ సినిమాల్లో అవకాశం ఇవ్వాలంటే దుస్తులు విప్పి చూపించాలని కొందరు మైనర్లను ఆడిషన్ల సమయంలో అడిగాడు. అలాంటి వ్యక్తిని బిగ్‌బాస్ షోలోకి ఎలా తీసుకుంటారు. ఆయనను వెంటనే షో నుంచి తీసివేయాలి’ అని స్వాతి డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలోనే ఆమెపై అత్యాచార ఆరోపణలు వస్తున్నాయి.
View this post on Instagram
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..