ముల్లంగి ఆకులే కదా పడేస్తే.. ఔషద గుణాలు కోల్పోయినట్టే.. 

24 November 2024

TV9 Telugu

జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ఫైబర్‌ ముల్లంగి ఆకుల్లో పుష్కలంగా ఉంటుంది. వీటితో చేసిన ఆహారం మలబద్ధకం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది.

జీర్ణ సమస్యలతో బాధపడేవారు తమ డైట్‌లో ముల్లంగి ఆకులను చేర్చుకోవటం మంచిదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

ముల్లంగి ఆకుల్లో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచుతుంది.

అనీమియాతో బాధపడేవారు.. వారి డైట్‌లో ముల్లంగి ఆకులను కచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

డయాబెటిస్‌ బాధితులకు ముల్లంగి గొప్ప డైట్‌ ఆప్షన్‌. ముల్లంగి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడతాయి.

లోబీపీ సమస్యతో బాధపడేవారు ముల్లంగి ఆకులను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

ముల్లంగి ఆకుల్లో సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును స్థిరీకరించడానికి సహయపడుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

శీతాకాలంలో ఎక్కువగా జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే విటమిన్‌ సి ముల్లంగి ఆకుల్లో పుష్కలంగా ఉంటుంది.