మనీ లాండరింగ్ కేసులో ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ అరెస్ట్

ఢిల్ల్లీ అల్లర్ల కేసులో నిందితుడు  ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ని ఈడీ సోమవారం అరెస్టు చేసింది. ఇతనిపై దాఖలైన మనీ  లాండరింగ్ కేసుకు సంబంధించి ఇతడిని అదుపులోకి తీసుకున్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి..

  • Umakanth Rao
  • Publish Date - 4:57 pm, Mon, 31 August 20
మనీ లాండరింగ్ కేసులో  ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ అరెస్ట్

ఢిల్ల్లీ అల్లర్ల కేసులో నిందితుడు  ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ని ఈడీ సోమవారం అరెస్టు చేసింది. ఇతనిపై దాఖలైన మనీ  లాండరింగ్ కేసుకు సంబంధించి ఇతడిని అదుపులోకి తీసుకున్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. తాహిర్ ని తమకు ఆరు రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. గత ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లు, ఘర్షణల్లోతాహిర్ హుస్సేన్ ప్రమేయం ఉందని, నిరూపణ అయిన దృష్ట్యా ఇతడిని  తీహార్ జైలుకు తరలించిన సంగతి విదితమే, ఫిబ్రవరి 24,25 తేదీల్లో నాడు సీఏఏ కి వ్యతిరేకంగా నగరంలో పెద్ద ఎత్తున ఘర్షణలు, అల్లర్లు రేగాయి. నిరసనకారులపై హుస్సేన్ తన ఇంటిపైనుంచి రాళ్లు,  పెట్రోలు బాంబులతో దాడి చేసాడని, ఆ ఘటనలో పలువురు గాయపడ్డారని, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి హత్యలో కూడా ఇతని హస్తం ఉందని ఇదివరకే వార్తలు వచ్చాయి. ఇతడిని పాలక ఆప్ పార్టీ సస్పెండ్ చేసింది.

జమాతే తబ్లీఘీ నేత మౌలానా సాద్ తో కూడా తాహిర్ హుస్సేన్ కి లింక్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. తబ్లీఘీ పెద్దఎత్తున  విదేశీ నిధులను అక్రమంగా పొందిందని, ఈ వ్యవహారంలో మౌలానా , తాహిర్ హుస్సేన్ చేతులు కలిపారని ఈడీ ఆరోపిస్తోంది. దీంతో ఇతనిపై  మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.