గౌతమ్ గంభీర్‌పై ఛీటింగ్ కేసు.. అసలేం జరిగిందో తెలుసా?

భారత క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌పై ఢిల్లీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఘజియాబాద్‌లో రుద్ర బిల్డ్‌ వెల్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్‌ఆర్ ఇన్‌ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కలిపి నిర్వహించిన ప్రాజెక్టకు గంభీర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఈ హౌసింగ్ ప్రాజెక్టులో అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేయాలని ఆయన చేసిన ప్రకటనతో తాము మోసపోయామని బాధితులు ఫిర్యాదు చేశారు. కోట్లాది రూపాయలు వసూలు చేసి డబ్బులు చెల్లించినవారికి ఫ్లాట్లు ఇవ్వకుండా ఈ సంస్ధల యజమానులు […]

గౌతమ్ గంభీర్‌పై ఛీటింగ్ కేసు.. అసలేం జరిగిందో తెలుసా?
Gautam Gambhir
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 29, 2019 | 12:36 AM

భారత క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌పై ఢిల్లీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఘజియాబాద్‌లో రుద్ర బిల్డ్‌ వెల్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్‌ఆర్ ఇన్‌ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కలిపి నిర్వహించిన ప్రాజెక్టకు గంభీర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఈ హౌసింగ్ ప్రాజెక్టులో అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేయాలని ఆయన చేసిన ప్రకటనతో తాము మోసపోయామని బాధితులు ఫిర్యాదు చేశారు. కోట్లాది రూపాయలు వసూలు చేసి డబ్బులు చెల్లించినవారికి ఫ్లాట్లు ఇవ్వకుండా ఈ సంస్ధల యజమానులు తమను మోసం చేశారంటూ 2016 నుంచి బాధితులు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ కేసులో క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌తో పాటు మరికొందరి పేర్లను చేర్చుతూ ఢిల్లీ పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు.

2011లో రుద్ర బిల్డ్‌ వెల్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్‌ఆర్ ఇన్‌ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు సంయుక్తంగా ఘజియాబాద్‌లో ఫ్లాట్స్ అమ్మకాలకు సంబంధించి ప్రకటనలు రిలీజ్ చేశారు. అయితే 50 మంది ఫ్లాట్స్ బుక్స్ చేసుకున్నప్పటికీ వారికి ఫ్లాట్ల్ అప్పగించలేదు. దీంతో వీరంతా పోలీసులను ఆశ్రయించారు. బాధితుల వద్దనుంచి డబ్బు వసూలు చేసిన సంస్ధ తమను మోసం చేసిందని ఆరోపిస్తూ చేసిన ఫిర్యాదుపై 2016లో కేసు నమోదైంది. ఈ హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించి జూన్6 , 2013న భవన నిర్మాణానికి సంబంధించి గడువు ముగిసింది. అయితే జూన్, జూలై 2014లో బాధితులను నమ్మించి డెవలపర్స్ ఫ్లాట్స్ కొనుగోలు చేయించారని పోలీసులు తాజాగా దాఖలు చేసిన ఛార్జీషీట్‌లో పేర్కొన్నారు. అయితే బాధితులకు ఫ్లాట్స్ విషయంలో ఎటువంటి విషయాలు తెలియనివ్వకుండా డబ్బును వసూలు చేశారని తెలిపారు. ఇదిలా ఉంటే గృహ నిర్మాణాలకు సంబంధించి అవసరమైన లైసెన్స్ ఫీజు చెల్లింపులు డిఫాల్ట్ కావడం,ఇతర నిబంధనలు కూడా పాటించకపోవడంతో అధికారులు ఏప్రిల్ 15, 2015న ఈ గృహ నిర్మాణాల ప్రాజెక్టు మంజూరును రద్దు చేశారని. అయితే అప్పటికే డబ్బు చెల్లించిన వారికి ఈ విషయాలు తెలియకుండా జాగ్రత్త పడ్డారని పోలీసులు ఛార్జీషీట్‌లో పేర్కొన్నారు.

Delhi Police files chargesheet against Gautam Gambhir గౌతమ్ గంభీర్ సెలబ్రిటీ కావడంతో.. ఆయన రుద్ర బిల్డ్‌ వెల్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్‌ఆర్ ఇన్‌ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఈ కేసులో గంభీర్‌తో పాటు ఇతర ప్రమోటర్లు ముఖేశ్ ఖురానా, గౌతమ్ మోహ్రా, బబితా ఖురానాలను ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్లు 406, 420, 34 సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఇదిలా ఉంటే హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టిన రుద్ర బిల్డ్‌ వెల్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్‌ఆర్ ఇన్‌ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి, డబ్బు చెల్లించి ఫ్లాట్స్ కొనుగోలు చేసి మోసపోయిన బాధితులకు మధ్య గౌతమ్ గంభీర్ ప్రస్తుతం ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తుంది. బాధితులతో గంభీర్‌కు నేరుగా సంబంధాలు లేకపోయినా .. ఆయన భారీగా ప్రకటనలు ఇవ్వడంతోనే తాము మోసపోయామని, ఫ్లాట్స్ కోసం తామంతా కోట్లాది రూపాయలు చెల్లించి మోసపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అంత్యంత ప్రజాదరణ పొందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్ధకు అప్పటికి మంచి ఫామ్‌లో ఉన్న నటితో భారీగా ప్రకటనలు ఇప్పించారు. ఈ ప్రకటనలు ఆకర్షితులై ఎంతో మంది ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. తీరా సంస్ధ బోర్డు తిప్పేయడంతో బాధితులు తమను మోసం చేసిన సంస్ధతో పాటు ఆ హీరోయిన్‌పై కూడా కేసు నమోదు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం గంభీర్ పరిస్థితి కూడా ఇలాగే అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.