Delhi MCD Election Exit Poll Results: ఢిల్లీ మున్సిపల్‌ పీఠం అధికార పార్టీదే..! టీవీ9 నెట్‌వర్క్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా ఇదే..

దేశరాజధాని ఢిల్లీలో ఆప్‌ కొత్త చరిత్ర సృష్టించబోతుందని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. టీవీ9 నెట్‌వర్క్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం..

Delhi MCD Election Exit Poll Results: ఢిల్లీ మున్సిపల్‌ పీఠం అధికార పార్టీదే..! టీవీ9 నెట్‌వర్క్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా ఇదే..
Mcd Election 2022

Updated on: Dec 05, 2022 | 6:50 PM

Exit Poll For Delhi MCD Elections Results 2022: దేశరాజధాని ఢిల్లీలో ఆప్‌ కొత్త చరిత్ర సృష్టించబోతుందని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. టీవీ9 నెట్‌వర్క్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం.. 250 స్థానాల్లో ఆప్‌కు 140-150 స్థానాలు , బీజేపీకి 92-96 , కాంగ్రెస్‌ కు 6-10 స్థానాలు దక్కే అవకాశం ఉందని అంచనా వేసింది. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ తిరుగులేని విజయం సాధిస్తుందని అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి.

ఎంసీడీ ఎన్పికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్వయంగా జేపీ నడ్డా అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేశారు. లిక్కర్‌ స్కాం, సత్యేంద్రజైన్‌ వరుస జైలు వీడియోలతో ముప్పేట బీజేపీ ప్రచారదాడి చేసినప్పటికి 250 డివిజన్లలో ఆప్‌ సత్తా చాటినట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి.

దాదాపు 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీ అభ్యర్ధుల తరపున ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రచారం చేశారు. కానీ, ఆప్‌ ఒకే ఒక అస్త్రాన్ని ప్రయోగించింది. నగరంలో పేరుకుపోయిన చెత్తకుప్పలనే బీజేపీపై అస్త్రంగా ప్రయోగించింది . ఢిల్లీలో మళ్లీ బీజేపీ గెలిస్తే ప్రతి చోట చెత్త గుట్టలే కన్పిస్తాయని ఓటర్లను ఆప్‌ ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది నిజమైతే.. పంజాబ్‌ ఎన్నికల తరువాత ఆప్‌కు ఇది పెద్ద విజయంగా చెప్పుకోవాలి. బీజేపీ అన్ని అస్త్రాలను ప్రయోగించినప్పటికి కేజ్రీవాల్‌ తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు హంగు ఆర్భాటం లేకుండా ఓటర్లను తమవైపు తిప్పుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..