ఢిల్లీ: హెయిర్ కటింగ్ కోసం ఓ వ్యక్తి సెలూన్‌కు వెళ్లాడు. ఇంతలో బార్బర్ కొడుకు సిగరెట్ వెలిగించాడు. బయటకు వెళ్లి సిగరెట్ కాల్చుకోమని కస్టమర్ అతన్ని కోరాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన సదరు వ్యక్తి కత్తెరతో పలుమార్లు కస్టమర్‌పై దాడి చేశాడు. ఈ దారుణ ఘటన దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం (జూన్ 11) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఢిల్లీలోని కిషన్‌గఢ్‌కు చెందిన ఓ సెలూన్ షాప్‌కు అభయ్ కుమార్ (38) హెయిర్ కట్‌కు వచ్చాడు. షాప్‌లో ఉన్న మోహిత్ మహ్లావత్ (22) పొగతాగడం ప్రారంభించాడు. తనకు అలర్జీ ఉందని, బయటికి వెళ్లి సిగరెట్ కాల్చమన్నాడు. దీంతో కోపోధ్రిక్తుడైన మోహిత్ అతనితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం దుకాణంలోని కత్తెరతో అభయ్‌పై దాడికి దిగాడు. అభయ్‌ను తొమ్మిది చోట్ల కత్తెరతో పొడిచాడు. అనంతరం చుట్టుపక్కన వారు అతన్ని బంధించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. నిందితుడు షాపు యజమాని కుమారుడిగా పోలీసులు గుర్తించారు. ఐపీసీలో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి మోహిత్‌ను అరెస్ట్ చేశారు. బాధితుడు అభయ్ ఓ ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్నాడు. మోహిత్ నిరుద్యోగి. దురలవాట్లను బానిసైన మోహిత్ నిత్యం తండ్రి షాప్‌లో సిగరెట్లు కాల్చుతూ.. కస్టమర్లతో దురుసుగా ప్రవర్తించేవాడని పలువురు ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.