Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో బిగ్ ట్విస్ట్.. రాజేష్ జోషిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు..

దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీబీఐ, ఈడీ దూకుడు పెంచాయి. విచారణలో భాగంగా పలువురిని అరెస్టు చేస్తున్న ఈడీ.. తాజాగా మరొకరిని అరెస్టు చేసింది.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో బిగ్ ట్విస్ట్.. రాజేష్ జోషిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు..
Delhi Liquor Scam
Follow us

|

Updated on: Feb 09, 2023 | 10:05 AM

దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీబీఐ, ఈడీ దూకుడు పెంచాయి. విచారణలో భాగంగా పలువురిని అరెస్టు చేస్తున్న ఈడీ.. తాజాగా మరొకరిని అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రాజేష్ జోషి అనే వ్యక్తిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో రాజేష్ జోషికి ప్రత్యేక్ష సంబంధమున్నట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఛార్జ్ షిట్ దాఖలు చేసిన సీబీఐ, ఈడీ దర్యాప్తును ముమ్మరం చేశాయి. నిన్న ఇద్దరిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. బుధవారం రాజేష్‌ జోషిని అరెస్ట్‌ చేశారు. సౌత్‌ గ్రూప్‌ తరపున రూ.31 కోట్ల నగదు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దినేష్‌ అరోరాకు జోషి, లుపిన్ నగదు అందజేసినట్లు పేర్కొంటున్నారు. వీటిని గోవా ఎన్నికల్లో ఆప్‌ ఖర్చు చేసినట్టు గుర్తించారు.

విచారణలో భాగంగా ఈడీ బుధవారం హైదరాబాద్‌కు చెందిన ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం హైదరాబాద్‌లో బుచ్చిబాబును అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు ఢిల్లీ తరలించారు. ఆయనతోపాటు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌తో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్టు చేసింది.

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారిని కస్టోడియల్ రిమాండ్ కోరనున్నారు. దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఇప్పటివరకు మొత్తం 10 మంది అరెస్ట్‌ అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..