AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Delivery Scheme: రేషన్ డోర్ స్టెప్ డెలివరీ పథకాన్ని రద్దు.. అరవింద్ కేజ్రివాల్ సర్కార్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట

అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. డీలర్ యూనియన్ పిటిషన్ పై తీర్పునిస్తూ కోర్టు ఇంటింటికీ రేషన్ పంపిణీ పథకాన్ని రద్దు చేసింది. ఢిల్లీలో రేషన్ డోర్ స్టెప్ డెలివరీ పథకాన్ని రద్దు చేస్తూ..

Ration Delivery Scheme: రేషన్ డోర్ స్టెప్ డెలివరీ పథకాన్ని రద్దు.. అరవింద్ కేజ్రివాల్ సర్కార్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట
fortified rice
Sanjay Kasula
|

Updated on: May 19, 2022 | 8:59 PM

Share

అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. డీలర్ యూనియన్ పిటిషన్ పై తీర్పునిస్తూ కోర్టు ఇంటింటికీ రేషన్ పంపిణీ పథకాన్ని రద్దు చేసింది. ఢిల్లీలో రేషన్ డోర్ స్టెప్ డెలివరీ పథకాన్ని రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని తీసుకువస్తుందని.. అయితే దానిని కేంద్ర ప్రభుత్వమే అందించాలని ఇంటింటికి ఆహారం ధాన్యాలను ఉపయోగించలేమని హైకోర్టు తాత్కాలిక ప్రదాన న్యాయమూర్తి విపిన్ సంఘీ అన్నారు. జనవరి 10న ఈ పిటిషన్‌లపై తీర్పును రిజర్వ్‌లో ఉంచిన కోర్టు గురువారం ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరో డోర్‌ డెలివరీ పథకాన్ని తీసుకువచ్చే స్వేచ్ఛ ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్నప్పటికీ.. ఇంటింటికీ రేషన్‌ పథకం ద్వారా కేంద్రం అందించే ఆహార ధాన్యాలను ఇవ్వలేరని తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ విపిన్‌ సింఘీ, జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఆప్‌ ప్రభుత్వ పథకాన్ని సవాలు చేస్తూ రేషన్‌ డీలర్లు దాఖలు చేసిన రెండు పిటిషన్‌లను హైకోర్టు విచారణకు అనుమతించింది. ”ముఖ్యమంత్రి ఘర్‌ ఘర్‌ రేషన్‌ యోజనా” పథకాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ సర్కారీ రేషన్‌ డీలర్స్‌ సంఫ్‌ు, ఢిల్లీ రేషన్‌ డీలర్స్‌ యూనియన్‌ ఈ పిటిషన్‌లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో డోర్ టు డోర్ రేషన్ డెలివరీ పథకం ఒకటి.