AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: ఎప్పుడూ లేని సంక్షోభంలో పడిపోయాం.. ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా అడుగంటాయి..వెల్లడించిన అరవింద్ కేజ్రీవాల్

కరోనా రెండో వేవ్ ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. కేంద్రం అన్నీ సరిగానే ఉన్నాయని చెబుతున్నా పలు రాష్ట్రాలు మందులు.. ఆక్సిజన్..బెడ్లు అందుబాటులో లేవని చెబుతున్నాయి.

Delhi: ఎప్పుడూ లేని సంక్షోభంలో పడిపోయాం.. ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా అడుగంటాయి..వెల్లడించిన అరవింద్ కేజ్రీవాల్
Kejriwal
KVD Varma
|

Updated on: Apr 17, 2021 | 7:31 PM

Share

Delhi: కరోనా రెండో వేవ్ ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. కేంద్రం అన్నీ సరిగానే ఉన్నాయని చెబుతున్నా పలు రాష్ట్రాలు మందులు.. ఆక్సిజన్..బెడ్లు అందుబాటులో లేవని చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి ఒక పెద్ద బాంబు పేల్చారు. గత 24 గంటల్లో ఎన్నడూ లేనివిధంగా 24,000 కొత్త కరోనా వైరస్ కేసులను నమోదు చేయడంతో, నగరం వేగంగా పడకలు, ఆక్సిజన్ అలాగే ప్రాణాలను రక్షించే రేమిడిసివార్ కూడా అందుబాటులో లేని పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పారు. పాజిటివిటీ రేటు 24 శాతానికి చేరుకుంది – అంటే పరీక్షించబడుతున్న వారిలో నలుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ వస్తోందని ఆయన అన్నారు.

“పరిస్థితి చాలా తీవ్రమైనది అలాగే ఆందోళన కలిగించేది” అని కేజ్రీవాల్ అన్నారు. “కేసులు చాలా వేగంగా పెరిగాయి. అందువల్ల కొన్ని రోజుల క్రితం వరకు ప్రతిదీ అదుపులో ఉన్నట్లు అనిపించినప్పటికీ మేము కొరతను ఎదుర్కొంటున్నాము. అయితే ఈ కరోనా ఎంత వేగం పెరుగుతుందో, దాని అంతం ఎక్కడ వరకూ తీసుకెళుతుందో ఎవరికీ తెలియదు” అని ఆయన చెప్పారు.

ఢిల్లీ తొ సహా భారతదేశంలోని ప్రధాన నగరాలను శనివారం వారాంతపు లాక్ డౌన్ లోకి కరోనా తీసుకువెళ్ళింది, దేశం తీవ్రమైన కొత్త కరోనావైరస్ తరంగాన్ని ఎదుర్కొంటుంది, రోజువారీ 2.3 లక్షలకు పైగా కేసులు వస్తున్నాయి. దీంతో అనేక రాష్ట్రాలు డ్రగ్స్ అలాగే హాస్పిటల్ పడకల కోసం ఇబ్బంది పడుతున్నాయి. అంతా బావుందనుకున్న తరుణంలో ఈ నెలలోనే 20 లక్షలకు పైగా కొత్త కేసులను భారతదేశం చూస్తుండటంతో దేశం మహమ్మారిని ఓడించిందనే ఆశలు ఆవిరయిపోయాయి. శనివారం దేశంలో 2.34 లక్షల కేసులు నమోదయ్యాయి, 1,341 మరణాలు నమోదు కావడం మొత్తం మహమ్మారి కారణంగా జరిగిన మరణాల సంఖ్య175,649కు చేరింది.

Also Read: కరోనా విజ‌‌ృంభణపై అప్రమత్తమైన కేంద్రం.. మరికాసేపట్లో ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ కీలక సమావేశం

భూమిలో తెల్లని ‘లోదుస్తులను’ పాతిపెడుతున్న ప్రజలు.. అసలు రహస్యం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.?