Delhi Coronavirus: దేశ రాజధానిలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Delhi Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టగా, తాజాగా దేశ వ్యాప్తంగా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ..

Delhi Coronavirus: దేశ రాజధానిలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Delhi Coronavirus
Follow us

|

Updated on: Mar 28, 2021 | 9:51 PM

Delhi Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టగా, తాజాగా దేశ వ్యాప్తంగా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా దేశంలోని 12 రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దాంతో ఆ 12 రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు కొవిడ్ నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేస్తున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలోనూ క‌రోనా వైర‌స్ వ్యాప్తి మరింత వేగవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిబంధనలు మరింత కఠినతరం చేసేందుకు సిద్ధమైంది. ఇక ఢిల్లీ పరిధిలోని జరిగే వివాహ వేడుకలు, ఇతర శుభకార్యాలకు, హాల్‌ సామర్థ్యం 50 శాతం మందికి, మొత్తం 100 మందికి మించకుండా హాజరయ్యేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఢిల్లీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ తెలిపారు. ఇక అంత్యక్రియలకు 50 మందికి మించి హాజరయ్యేందుకు అనుమతి లేదని ఆయన ప్రకటించారు. కాగా, ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్‌ కఠినమైన లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఢిల్లీ మంత్రి హెచ్చరించారు.

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కఠినమైన ఆదేశాలు ఆయా రాష్ట్రాలకు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో కేసుల కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పాటు కేసుల తీవ్రతను బట్టి కంటైన్మెంట్ జోన్లతో కోవిడ్‌ను కట్టడి చేయాలని సూచించారు. రోజూవారీ పరీక్షల సంఖ్యను పెంచాలన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని.. అర్హులందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని సూచించారు. దీంతోపాటు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను చేపట్టాలని.. దీంతోనే కరోనాను కట్టడి చేయగలమని పేర్కొన్నారు. దేశంలో వ్యాక్సిన్‌కు కొరత లేదని.. క్రమానుగుణంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. మరి కొన్నిరోజుల్లో పండుగలు రానున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు.

ఇవీ చదవండి: మహారాష్ట్ర సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ… ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే…

Telangana Corona: తెలంగాణలో మాస్క్ మస్ట్.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. సర్కార్ కీలక ఆదేశాలు

కరోనా నిబంధనలు పాటించనట్లయితే కఠినమైన లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించక తప్పదు.. అధికారుల సమావేశంలో సీఎం