ఢిల్లీలో వరుసగా ఐదో రోజూ పెరిగిన కరోనా కేసులు
ఢిల్లీలో వరుసగా ఐదో రోజూ కరోనా వైరస్ కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 4,235 కేసులు నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యాక్టివ్ కేసులు 28.812 కాగా, లక్షా 84 వేల మందికి పైగా రోగులు కోలుకున్నారని
ఢిల్లీలో వరుసగా ఐదో రోజూ కరోనా వైరస్ కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 4,235 కేసులు నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యాక్టివ్ కేసులు 28.812 కాగా, లక్షా 84 వేల మందికి పైగా రోగులు కోలుకున్నారని, రికవరీ రేటు 84. 26 శాతం ఉందని ఈ వర్గాలు వివరించాయి. కంటెయిన్మెంట్ జోన్ల సంఖ్య 1488 కి పెరిగింది. అటు-టెస్టింగుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించారు. వీటిని పెంచడం కూడా కరోనా కేసులు పెరగడానికి ఓ కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు మరణాల రేటు 2.17 శాతంగా ఉందని అధికారవర్గాలు వివరించాయి.