Viral: తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన కుమారుడు.. సీన్ కట్ చేస్తే.. తెల్లారేసరికి ఊహించని షాక్!

గుడికి వెళ్లిన తల్లి.. ఆ తర్వాత ఇంటికి చేరుకోలేదు. అసలేం జరిగిందో.? ఆమె ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు.! అయితే..

Viral: తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన కుమారుడు.. సీన్ కట్ చేస్తే.. తెల్లారేసరికి ఊహించని షాక్!
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 26, 2022 | 1:15 PM

గుడికి వెళ్లిన తల్లి.. ఆ తర్వాత ఇంటికి చేరుకోలేదు. అసలేం జరిగిందో.? ఆమె ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు.! అయితే ఈలోపు కుమారుడికి ఓ వృద్ధురాలి మృతదేహం రైలు పట్టాలపై పడి ఉందన్న సమాచారం అందుతుంది. అది అతడి తల్లే అనుకుని అంత్యక్రియలు నిర్వహించాడు. అయితే అంత్యక్రియలు నిర్వహించిన ఆ మరుసటి రోజే అతడికి ఊహించని షాక్ తగిలింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.!

వివరాల్లోకి వెళ్తే.. చెంగల్పట్టులోని గుడువంచెరుకు చెందిన వడివేలు తన తల్లి చంద్ర(72)తో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. సెప్టెంబర్ 20న గుడికి వెళ్లిన అతడి తల్లి.. మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. తన తల్లి ఆచూకీ కోసం వడివేలు అన్ని చోట్లా వెతికాడు. అయినా ఏ ప్రయోజనం లేకపోయింది. అనంతరం ఓ వృద్దురాలి మృతదేహం రైలు పట్టాలపై పడి ఉందని వడివేలుకు ఎవరో సమాచారం అందించారు. మృతురాలి ఫోటో తన తల్లిని పోలి ఉండటంతో.. తన తల్లే రైలు ప్రమాదంలో మరణించినట్లు వడివేలు భావించాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించాడు. అయితే మరుసటి రోజు అతడికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది.

ఆ మరుసటి రోజు వడివేలు తల్లి చంద్ర ఇంటికి చేరుకుంది. దీంతో అతడి ఆనందానికి అవధులు లేవు. తన తల్లి అనుకుని అంత్యక్రియలు నిర్వహించింది వేరొక మహిళ మృతదేహానికి అని గ్రహించి పోలీసులకు సమాచారాన్ని అందించాడు వడివేలు. పాతిపెట్టిన మృతదేహాన్ని తవ్వితీశారు. అనంతరం పోలీసులు ఆ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే